Share News

మత్స్యకారులకు ప్రభుత్వం అండ

ABN , Publish Date - Oct 18 , 2024 | 01:14 AM

మత్స్యకార్మికుల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలోని పెద్దచెరువు, బీబీనగర్‌ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలారు

మత్స్యకారులకు ప్రభుత్వం అండ

ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

వలిగొండ, బీబీనగర్‌ అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మత్స్యకార్మికుల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలోని పెద్దచెరువు, బీబీనగర్‌ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూరు శాతం సబ్సిడీపై నాణ్యమైన చేపపిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాసిరకం చేపపిల్లలను ఇవ్వడంతో మత్స్యకారులు నష్టపోయారన్నారు. చేపపిల్లల పెంపకంపై మాజీ మంత్రి హరీ్‌షరావు చేసిన వ్యాఖ్యాలు సరికావన్నారు. చెరువులో నీరుంటేనే చేపల పెంపకం సాధ్యమని ఆయనకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రజల మద్దతుతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రక్షాళనతో స్వచ్ఛమైన నీరు అందుతుందని దీనిపై ఆధారపడ్డ వ్యవసాయం, మత్స్య సంపద, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతాయన్నారు. మూసీ పరివాహకంలో నివాసం ఏర్పాటుచేసుకున్న వారికి కొంత ఇబ్బంది కలిగినా, వారికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ప్రభుత్వం మత్స్యకార్మికులకు రూ.5లక్షల ఉచిత బీమా అందజేస్తోందన్నారు. కార్యక్రమాల్లో పిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, మత్స్యకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాశం సంజయ్‌బాబు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఏడీ రాజారామ్‌, మాజీ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, నాయకులు కుంభం విద్యాసాగర్‌రెడ్డి, సోమనబోయిన సతీష్‌, పాశం సత్త్తిరెడ్డి, కంకల కిష్టయ్య, వాకిటి అనంతరెడ్డి, బాల్‌నర్సింహ, బోళ్ల శ్రీను, సహదేవ్‌, లింగయ్య, బీబీనగర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు పంజాల రామాంజనేయులుగౌడ్‌, గోళి పింగల్‌రెడ్డి, పొట్టోళ్ల శ్యాంగౌడ్‌, గోళి నరేందర్‌రెడ్డి, నికిల్‌రెడ్డి, బెండ ప్రవీణ్‌, పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 01:14 AM