Share News

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:20 AM

వానాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరాయి. మరో రెండు మూడు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కానుంది. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరకు విక్రయించేందుకు ప్రతీ సంవత్సరం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు

2.08లక్షల మెట్రిక్‌టన్నుల ఽధాన్యం సేకరణ

372 కేంద్రాల్లో 24వేల మంది రైతులు మద్దతు ధరకు విక్రయం

రూ.483.69కోట్లకు రైతులకు రూ.483.14కోట్లు మేరకు చెల్లింపు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): వానాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరాయి. మరో రెండు మూడు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కానుంది. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరకు విక్రయించేందుకు ప్రతీ సంవత్సరం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో 17 మండలాల్లో వరిని సాగుచేస్తారు. బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌, రామన్నపేట, వలిగొండ మండలాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధిక శాతం వరిని సాగుచేస్తారు.

జిల్లాలో మొత్తం 2.60లక్షల ఎకరాల్లో వరిని సాగుచేశారు. 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని, దాదాపు నాలు గు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉం దని అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్‌లోనూ జిల్లాలో మొత్తం పీఏసీఎస్‌, ఐకేపీ, ఎఫ్‌పీవోల ద్వారా 372 కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. పీఏసీఎ్‌సల ఆధ్వర్యంలో 234 కేంద్రాలు, ఐకేపీ 122, ఎఫ్‌పీవోల ద్వారా 16కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. జిల్లాలో మొత్తం 24,009 మంది రైతుల వద్ద ఇప్పటివరకు 2,08,487.880 మెట్రిక్‌టన్నుల ధా న్యాన్ని సేకరించారు. మరో ఐదు కేం ద్రాల పరిధిలో 2వేల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం కొనుగోలు చే సే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూసీ పరివాహక ప్రాం తాల్లోని ఐదు కేంద్రాల్లో నిత్యం 200మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం సేకరిస్తున్నారు. ఈ కేంద్రాల్లోనూ రెండురోజుల్లోగా కొనుగోళ్లు పూర్తికానున్నాయి.

రూ.483. 69కోట్ల విలువైన ఽధాన్యం కొనుగోలు

జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 2.08లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం రూ.483కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లతో సివిల్‌సప్లయ్‌ పోర్టల్‌లో నమోదు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ ప్రభుత్వానికి విక్రయించిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని నివేదికలు పంపారు. రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమచేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 23,984మంది రైతులకు రూ.483.14కోట్ల మేరకు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మరో రూ.55,18,816 వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. వీటిని పోర్టల్‌లో నమోదు చేశారు. రైతులు విక్రయించిన 48 గంటల్లోగా డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు జిల్లా యంత్రాంగం ధాన్యం సేకరించిన రైతులకు వెనువెంటనే డబ్బులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

4,511 మెట్రిక్‌టన్నుల సన్నధాన్యం సేకరణ

ప్రభుత్వం ఈసారి సన్న ధాన్యం సేకరణకు అనుమతించింది. అయితే జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులతో సన్న ధాన్యం సాగుపై సర్వే నిర్వహించింది. జిల్లాలో సాధారణ ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రాల్లోనే, సన్న ధాన్యాన్ని కూడా సేకరించారు. జిల్లావ్యాప్తంగా 4511.240 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభంకావడంతో, ప లు ప్రాంతాల్లో రైతులువ్యాపారులను ఆశ్రయించారు. వాతావరణంలో మార్పులు సంభవించి తుఫాను కారణంగా చిరుజల్లులతో కూడి వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమైతే చాలు రైతుల్లో వరికోతలు పూర్తి చేసుకుని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. వర్షానికి ధాన్యం తడవకముందే విక్రయించాలని కమీషన్‌ ఏజెంట్లు, దళారులను ఆశ్రయించారు. జిల్లాలో దాదాపు 2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కల్పించిన మద్దతు క్వింటాకు ధర రూ.2350 ఏ-గ్రేడ్‌ రకానికి, అయితే కమీషన్‌ ఏజెంట్లు, దళారులు రైతుల వద్ద క్వింటాకు రూ.1700 నుంచి రూ.1900వరకు కొనుగోలు చేశారు. దీంతో రైతులు మద్దతు ధర నష్టపోయారు.

తుదిశకు ధాన్యం కొనుగోళ్లు : జగదీష్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 372 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.08లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించాం. మొత్తం రూ.483కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించి, ఇప్పటివరకు 23,984 మంది రైతులకు రూ.483. 14కోట్లు మేరకు చెల్లించాం. మరో రెండుమూడు రోజుల్లోగా కొనుగో లు ప్రక్రియ ముగియనుంది. జిల్లావ్యాప్తంగా సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న రైస్‌ మిల్లులకు తరలిస్తున్నాం.

Updated Date - Dec 19 , 2024 | 12:20 AM