జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:46 AM
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి వీ శ్రీహరి ఎంపికయ్యారు.
నిడమనూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి వీ శ్రీహరి ఎంపికయ్యారు. గత నెల 7, 8, 9 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన అండర్-14 విభాగంలో రాష్ట్ల్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున పాల్గొని మెరుగైన ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో నిర్వహించే కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. మహారాష్ట్రలో ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున శ్రీహరి ఆడనున్నాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తమ పాఠశాల విద్యార్థి శ్రీహరిని ప్రిన్సిపాల్ పాశం వెంకట్‌రెడ్డి, పీఈటీ కోటేష్, అధ్యాపక సిబ్బంది అభినందించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు, జిల్లాకు మంచిపేరు తేవాలని ఆకాక్షించారు.