Share News

మూడేళ్లుగా పిల్లర్ల దశలోనే..

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:34 AM

భువనగిరి మండలం సిరివేణికుంట-నందనం గ్రామాల మధ్య చిన్నేరు వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

మూడేళ్లుగా పిల్లర్ల దశలోనే..

నత్తనడకన సిరివేణికుంట- నందనం హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

భువనగిరి రూరల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : భువనగిరి మండలం సిరివేణికుంట-నందనం గ్రామాల మధ్య చిన్నేరు వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడేళ్లుగా నిర్మాణ పనులు జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నేరు వాగుపై ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎ్‌సవై) పథకంలో భాగంగా రూ.4కోట్లతో 2021 సెప్టెంబరు 22న బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రార ంభించారు. మూడేళ్లు పూర్తయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి. గతంలో వాగులో నీటి ప్రవాహం ఉందని పలుమార్లు కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. కాగా ప్రస్తుతం ఆ వాగులో ఎలాంటి నీటి ప్రవాహం లేకపోయినా బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. భువనగిరి, వలిగొండ మండలాల నుంచి ఈ రహదారి గుండా సిరివేణికుంట, మాదారం రావిపహాడ్‌, ముగ్దుంపల్లి, బీబీనగర్‌ మండలాలకు నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొన సాగిస్తుంటాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినట్లయితే ఆయా గ్రామాలకు రాకపోకలు కొనసాగించే ప్రజల ఇబ్బందులు తొలగుతాయి. ఈ విషయమై వారం క్రితం నందనం, సిరివేణికుంట గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డిని కలిసి అసంపూర్తి బ్రిడ్జి పనులను పూర్తి చేయించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

పనులు పూర్తి చేయాలి

అసంపూర్తిగా నిలిచిన హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి. దాదాపు మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాకపోవడం సరి కాదు. బ్రిడ్జిపనులు పూర్తయితే ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగుతాయి.

- పడాల అనిత, మాజీ సర్పంచ సిరివేణికుంట

పనులు ప్రారంభిస్తాం

బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.4 కోట్ల నిధులు మంజూ రయ్యా యి. ఇప్పటికి అందులో రూ.కోటి 50లక్షల పని పూర్తి కావడంతో బిల్లులు కూడా మంజూరయ్యా యి. పలుమార్లు వాగులో వరద నీరు ప్రవహిస్తుండడంతో సదరు కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశాడు. సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశాం. బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తాం.

- ప్రసాద్‌, స్పెషల్‌ పంచాయతీ రాజ్‌, ఏఈ

Updated Date - Dec 07 , 2024 | 12:34 AM