స్వయం ఉపాధితో ఆదాయం పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:38 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పాడి-పశుపోషణ ’ అనే అంశం పై 10 రోజులపాటు శిక్షణ పొంది నైపుణ్యా న్ని పెంచుకుంటూ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జి.శ్రీనివాస్ అన్నారు.
అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్
భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబరు 4: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పాడి-పశుపోషణ ’ అనే అంశం పై 10 రోజులపాటు శిక్షణ పొంది నైపుణ్యా న్ని పెంచుకుంటూ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జి.శ్రీనివాస్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలుగా 100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాల్లోని అర్హత కలిగిన అభ్యర్థులకు మండలంలోని దంతూరు గ్రామంలో బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తూ 100 రోజులు పనిపూర్తి చేసుకున్న కూలీ కుటుంబాలకు ఉన్నతి కార్యక్రమం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. కేవలం కూలి పనుల మీదనే ఆధారపడకుండా ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా మరింత ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఈటీఐ డైరెక్టర్ రఘుపతి, ఎంపీడీవో రాపర్తి భాస్కర్, వెటర్నరీ డాక్టర్ చంద్రారెడ్డి, జాబ్స్ ఏపీఎం రాజు, ఏపీవో కృష్ణమూర్తి, ఏపీఎం నీరజ, కో-ఆర్డినేటర్ బాల్యనాయక్, గ్రామ కార్యదర్శి మాధురి, సీసీ కల్పన, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం, జేఆర్‌పీ పద్మ, దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి గ్రామాల ఉన్నతి శిక్షణా అభ్యర్థులు పాల్గొన్నారు