కందులకు పెరిగిన డిమాండ్
ABN , Publish Date - Feb 03 , 2024 | 12:12 AM
:సూర్యాపేట జిల్లాలో కంది పంట క్వింటా రూ.10వేలకు పైగా పలుకుతోంది.
సూర్యాపేట మార్కెట్‌లో గరిష్ట ధర రూ.10,062, తిరుమలగిరిలో రూ.10,217
సూర్యాపేట సిటీ / తిరుమలగిరి, ఫిబ్రవరి 2 :సూర్యాపేట జిల్లాలో కంది పంట క్వింటా రూ.10వేలకు పైగా పలుకుతోంది. ధర రూ.7000లు కాగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో గురువారం రూ.9,999లు పలుకగా, శుక్రవారం రూ.10,062లు ధర పలికింది. ఐదుగురు రైతులు 17 బస్తాల కందులు తీసుకురాగా, వాటిలో ఒక రైతుకు చెందిన కందులకు రూ.10,062లు ధర కేటాయించారు. కనిష్ఠ ధర రూ.9,572లు, మోడల్ ధర రూ.10,033 లు ధరలను ఖరీదుదారులు నిర్ణయించారు. అంతేకాకుండా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో వారం రోజులుగా కందులకు రికార్డు ధరలు నమోదవుతున్నాయి. శుక్రవారం 544 బస్తాల్లో 321 క్వింటాళ్ల కందులు రాగా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన రైతు గుగులోతు బద్రుకు చెందిన 10 క్వింటాళ్ల కందులు రూ.10,217 ధర పలికింది. కనిష్టంగా రూ.8089 ధర పలికింది. మద్దతుకు మించి ధరలు లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.