Share News

సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

ABN , Publish Date - Dec 18 , 2024 | 12:07 AM

భవిష్యత్‌కు చదువు ఎంతో ఉపయోగమని, అలాంటి విద్యాశాఖలో ఏళ్లుగా పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె మంగళవారం ఎనిమిదో రోజుకు చేరుకుంది.

సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత

భువనగిరి (కలెక్టరేట్‌), డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌కు చదువు ఎంతో ఉపయోగమని, అలాంటి విద్యాశాఖలో ఏళ్లుగా పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె మంగళవారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ సంద్భంగా కలెక్టరేట్‌ సమ్మె శిబిరాన్ని ఆమె సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. చాలా కాలంగా విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పలు శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల వేతనాలు పెంచామని, కేజీబీవీ ఉద్యోగులకు న్యాయం చేశామన్నారు. విద్యుత్‌శాఖలో పనిచేసే కాంట్రాక్టు హెల్పర్లు, ఇతరులను క్రమబద్ధీకరించామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం తీర్చేవరకు సమ్మె విరమించవద్దని, అప్పటి వరకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాగార్జున, చైతన్య, కవిత, అరుణ, భవాని, సంధ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మండల విద్యాధికారుల సంఘం మద్దతు

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు జిల్లా ఎంఈవోల సంఘం నాయకులు మద్దతు తెలిపి వారితో పాటు శిబిరంలో కూర్చున్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు నాగవర్ధన్‌రెడ్డి, యామిని, సురే్‌షరెడ్డి, రఘురామిరెడ్డి, సెక్టోరియల్‌ అధికారి పెసరు లింగారెడ్డి, ప్రభుత్వ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 12:07 AM