మద్యం మత్తులో ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామినర్
ABN , Publish Date - Feb 09 , 2024 | 12:02 AM
ఇంటర్ ప్రాక్టికల్స్ విధులకు ఓ ఎగ్జామినర్ మద్యం మత్తులో హాజరయ్యాడు. విద్యార్థులు గుర్తించి ప్రిన్సిపాల్‌కు సమాచారమివ్వడంతో విధుల నుంచి తొలగించారు.
దేవరకొండ, ఫిబ్రవరి 8 : ఇంటర్ ప్రాక్టికల్స్ విధులకు ఓ ఎగ్జామినర్ మద్యం మత్తులో హాజరయ్యాడు. విద్యార్థులు గుర్తించి ప్రిన్సిపాల్‌కు సమాచారమివ్వడంతో విధుల నుంచి తొలగించారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ బాలుర జూనియర్ కళాశాలలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ద్వితీయ ఇంటర్ ఫిజిక్స్ ప్రాక్టికల్ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు రెండు దఫాల్లో నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించనున్న ఈ పరీక్షలకు మిర్యాలగూడ పట్టణానికి ప్రైవేట్ కళాశాల లెక్చరర్ చంద్రశేఖర్‌కు ఇంటర్ బోర్డు విధులను కేటాయించింది. ఉదయం బ్యాచ పరీక్ష ముగియగానే భోజనానికి వెళ్లిన చంద్రశేఖర్ మద్యం మత్తులో మధ్యాహ్నం 2గంటలకు పరీక్షకు హాజరయ్యాడు. చంద్రశేఖర్ గదిలోకి రావడంతోనే గుర్తించిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ మల్లయ్యకు ఫిర్యాదుతో చేయడంతో పాటు విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారమిచ్చారు. వెంటనే ప్రిన్సిపాల్ మల్లయ్య పరీక్ష నిర్వహించే గదికి చేరుకుని ఎగ్జామినర్ చంద్రశేఖర్ మద్యం తాగి ఉన్నాడని గుర్తించి, విధుల నుంచి తొలగించారు. వెంటనే మరొక ఎగ్జామినర్‌ను నియమించి పరీక్షను కొనసాగించారు. ఎగ్జామినర్ చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఎనఎ్‌సయూఐ, సోషల్‌మీడియా జాతీయ కోఆర్డినేటర్ పాలగట్టి శ్రీకాంత, ఎస్‌ఎ్‌ఫఐ, యూఎ్‌సఎ్‌ఫఐ, విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్‌కు ఫోనలో ఫిర్యాదు చేశారు.