జిట్టా ఉద్యమస్ఫూర్తి ఎందరికో ఆదర్శం
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:44 AM
తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.
బీబీనగర్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలో ప్రజా అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఆయన జిట్టా కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా పైళ్ల మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో బాలకృష్ణారెడ్డి సేవలు మరువలేనివన్నారు. నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలు ఎవ్వరు తీర్చలేనివని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకవెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమానికి కుటుం బ సభ్యులు జిట్టా సతీమణి రజితారెడ్డి, తండ్రి బాల్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నాయకులు గోళి పింగల్ రెడ్డి, శ్యాంగౌడ్, రామాంజనేయులు గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు గౌడ్, నరేందర్‌రెడ్డి, శంకర్, లక్ష్మీనారాయణ, సాయిలు, రవి, జంగయ్య, శంకర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.