Share News

గులాబీలో జోష్‌

ABN , Publish Date - Feb 14 , 2024 | 12:32 AM

గడియారం సెంటర్‌ నుంచి మర్రిగూడ బైపాస్‌ వరకు కట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ తోరణాలతో ప్రధాన రహదారి గులాబిమయమైంది.

గులాబీలో జోష్‌
సభా ప్రాంగణంలో సమీపంలోని కటౌట్‌, భవంతి ఎక్కి తిలకిస్తున్న కార్యకర్తలు

రామగిరి, ఫిబ్రవరి 13 : గడియారం సెంటర్‌ నుంచి మర్రిగూడ బైపాస్‌ వరకు కట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ తోరణాలతో ప్రధాన రహదారి గులాబిమయమైంది.

- కార్యకర్తల వాహనాలతో బైపాస్‌ రోడ్డు ట్రాఫిక్‌ జామ్‌ కాగా, ఇదే సమయంలో ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

- మధ్యాహ్నం 2 గంటల నుండే వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

- కళాకారులు తమ ఆటపాటలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

- సాయింత్రం 4.48 నిమిషాలకు కేసీఆర్‌ హెలికాప్టర్‌ సభా ప్రాంగణం కొంత దూరంలో దిగింది.

- 4.59 నిమిషాలకు కేసీఆర్‌ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వాకర్‌ సాయంతో వేదికపైకి వచ్చారు.

- 5.09 నిమిషాలకు జై తెలంగాణ నినాదంతో ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్‌, 5.49 నిమిషాల వరకు 40 నిమిషాల పాటు ప్రసంగించారు.

- కేసీఆర్‌ను చూసేందుకు, ప్రసంగాన్ని వినేందుకు వేదికకు ఎదురుగా ఉన్న భవనంపై కొంతమంది కార్యకర్తలు ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కి ఆసక్తి కనపరిచారు.

- కేసీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో సౌండ్‌ సిస్టమ్‌ మొరాయించడంతో సభలో కూర్చున్న హరీష్‌రావు లేచి వచ్చి సౌండ్‌ సిస్టమ్‌ను సరి చేయించారు.

- అదేపనిగా సౌండ్‌ సిస్టమ్‌ అంతరాయం కలగడంతో కేసీఆర్‌ కలుగజేసుకుని కొంపతీసి నీవు అక్కడోనివా అంటూ సౌండ్‌ సిస్టమ్‌ నిర్వాహకుడిని అనడం సభలో ఉన్న కార్యకర్తలను నవ్వించింది.

- సభలో కొంతమంది కార్యకర్తలు ఈలలు వేస్తూ అంతరాయం కలిగిస్తుండగా ఏయ్‌..! ఎవడయ్య వాడు... ఆపు ఆపు అంటూ కేసీఆర్‌ హెచ్చరించారు.

- ప్రతిపక్షాలపై సామెతలు, తిట్లతో కేసీఆర్‌ ప్రసంగం సాగింది.

- కేసిఆర్‌ ప్రసంగిస్తుండగా కార్యకర్తలు అత్యుత్సహంతో తోసుకోవడంతో వారిని ఆపడం పోలీసుల తరం కాలేదు. దీంతో చేయి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- కేసీఆర్‌ ప్రసంగం నడుస్తుండగానే దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు తిరుగుముఖం పట్టడం కనిపించింది.

కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన నేతలు

నల్లగొండ : కృష్ణా జాలాల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన చలో నల్లగొండ సభకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌, ఎమ్మెల్సీ తక్కెనపల్లి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన రేగట్టె మల్లికార్జునరెడ్డి ఉన్నారు.

Updated Date - Feb 14 , 2024 | 12:32 AM