కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:35 AM
మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వయంభు మత్స్యగిరీశుడి కల్యాణ వేడుకలు బుధవారం నేత్రపర్వంగా సాగాయి.
నేత్రపర్వంగా మత్స్యగిరీశుడి పరిణయ వేడుక
వలిగొండ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వయంభు మత్స్యగిరీశుడి కల్యాణ వేడుకలు బుధవారం నేత్రపర్వంగా సాగాయి. ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించారు. కల్యాణ మండపాన్ని పచ్చని తోరణాలు, పుష్పాలతో ఆందంగా అలంకరించి వేద పండితుల ప్రవచనాల నడుమ కల్యాణ వేడుక సాగింది. స్వామివారికి పట్టు పీతాంబరాలు మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం తరఫున ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, దేవస్థానం చైర్మన్ కొమ్మారెడ్డి నరే్‌షకుమార్‌రెడ్డి, దేవస్థాన ఈవో మోహన్‌బాబు అందజేశారు.
చూడముచ్చటగా కల్యాణ వేడుకలు
మత్స్యగిరి నరసింహస్వామి కల్యాణం లక్ష్మీదేవి అమ్మవారితో ప్రత్యేక మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా సాగింది. ముక్కోటి దేవతలు ఆహుతులుగా, సృష్టికర్త బ్రహ్మదేవుడి సమక్షంలో నృసింహుడు లోకకల్యాణార్థం సకల సంపదలకు నెలవైన అమ్మవారి మెడలో బుధవారం శుభముహూర్తంలో మాంగల్యధారణ చేశారు. పట్టువస్త్రాలు, స్వర్ణ, వజ్ర, వైఢూర్య ఆభరణాలతో ఉత్సవమూర్తులను ముస్తాబు చేసి, కల్యాణ మండపంపై అధిష్ఠింపజేశారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న కల్యాణం శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడి తొలి పూజలతో ఆరంభించారు. వరుడు నారసింహుడికి లక్ష్మీదేవి తండ్రి పాదప్రక్షాళన చేసిన అనంతరం కన్యాదాన తంతు నిర్వహించారు. మత్స్యగిరి బ్రహ్మోత్సవాల్లో ఎదుర్కోళ్ల ఉత్సవం వైభవంగా సాగింది. సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్య కళా బృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కల్యాణ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వెంకటరమణాచార్యులు, దేవస్థాన చైర్మన్ కొమ్మారెడ్డి నరే్‌షకుమార్‌రెడ్డి, ఽభువనగిరి మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ధర్మకర్త లు కరుణాకర్, వెంకటేష్, ప్రభాకర్, అంజయ్య, రవికుమార్, జగన్మోహన్‌రెడ్డి, ఊశయ్య, రాములు, కేతమ్మ, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్క ర్, మాజీ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, అర్చకుడు యాదగిరి స్వామి, నాయకు లు సత్తిరెడ్డి, కిష్టయ్య, రవి, సతీష్, రాంరెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.