Share News

నైతికహక్కు కోల్పోయిన కేసీఆర్‌:టీజేఎస్‌

ABN , Publish Date - Feb 08 , 2024 | 12:00 AM

కృష్ణాజలాల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కును మాజీ సీఎం కేసీఆర్‌ కోల్పోయారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల దర్మార్జున అన్నారు.

నైతికహక్కు కోల్పోయిన కేసీఆర్‌:టీజేఎస్‌

సూర్యాపేటటౌన: కృష్ణాజలాల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కును మాజీ సీఎం కేసీఆర్‌ కోల్పోయారని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల దర్మార్జున అన్నారు. ఈ నెల 11వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే కృష్ణా జలా ల్లో నాణ్యమైన వాటా - కేంద్ర ప్రభుత్వ వివక్ష, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం - దగా పడ్డ నల్లగొండ ’ సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించి, మాట్లాడారు. తెలంగాణ పోరాటమంతా నీళ్ల కోసమేనని తెలంగాణ సాధించుకున్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వా టా రాకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. రాష్ట్ర విభజన హామీల మేరకైనా కృష్ణాజలాలు ఇవ్వకుండా కేంద్రం గుత్తాధిపత్యాన్ని చెలాయించేలా గెజిట్‌ తెస్తే కేసీఆర్‌ మౌనంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్‌, నారబోయిన కిరణ్‌కుమార్‌, సూర్యనారాయణ, బొడ్డు శంకర్‌గౌడ్‌, బొమ్మగాని వినయ్‌గౌడ్‌, సుమననాయక్‌, రాజు, సతీష్‌, మల్సూర్‌నాయక్‌, సతీ్‌ష, గోపి, స్వామి పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2024 | 12:00 AM