కేసీఆర్ సభను అడ్డుకుంటాం
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:19 AM
నల్లగొండ జిల్లాను అన్నిరంగాల్లో అన్యాయం చేయడంతో పాటు ఎడారిగా మార్చిన కేసీఆర్‌కు నల్లగొండలో అడుగుపెట్టే అర్హత లేదని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ విమర్శించారు.
నల్లగొండ, ఫిబ్రవరి 12 : నల్లగొండ జిల్లాను అన్నిరంగాల్లో అన్యాయం చేయడంతో పాటు ఎడారిగా మార్చిన కేసీఆర్‌కు నల్లగొండలో అడుగుపెట్టే అర్హత లేదని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించే కేసీఆర్ సభను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టడంతో పాటు ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే నల్లగొండలో కృష్ణా జలాల హక్కుల పేరిట సభను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సభను రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నల్లగొండలో బీఆర్‌ఎస్ సభను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడ్డుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మాజీ సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జగనతో కేసీఆర్ అక్రమ ఒప్పందం
కోదాడ టౌన : ఆంధ్రప్రదేశ సీఎం జగనతో కేసీఆర్ అక్రమ ఒప్పందం పెట్టుకుని పోతిరెడ్డికి నీళ్లు తీసుకుపోయేలా చేశారని కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి ఆరోపించారు. కిసాన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వల్లే శ్రీశైలం నీటిని జగన ప్రభుత్వం తీసుకెళ్తుంది నిజం కాదా ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ అసెంబ్లీలో సీఎం జగన మాట్లాడుతూ కేసీఆర్ సహాయం చేశారని, సభలోనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఇది చాలదన్నట్టు నల్గొండలో సభ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ కొత్తనాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, కిసానసెల్ అధ్యక్షుడు షేక్ ముస్తాఫా, ఐఎనటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరావు, సోషల్ మీడియా మునగాల మండల అధ్యక్షుడు జిల్లేపల్లి గోపిచంద్, యూత కాంగ్రెస్ అధ్యక్షుడు డేగ శ్రీధర్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి రజనీకాంత, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్
భువనగిరి టౌన : ప్రాజెక్టుల అప్పగింత పేరిట మాజీ సీఎం కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ కిసాన సెల్ జిల్లా అధ్యక్షుడు మర్రి నర్సింహారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ చలో నల్లగొండ సభను నిరసిస్తూ కిసాన సెల్ ఆధ్వర్యంలో సోమవారం భువనగిరిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీ అప్పగించింది గత ప్రభుత్వమని, నేటి సభకు ఎవరూ వెళ్లవద్దన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, మునిసిపల్ మాజీ చైర్మన బర్రె జహంగీర్, కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్, కిసానసెల్ నాయకులు ఆదిరెడ్డి, మామిడి నరేందర్‌రెడ్డి, దశరథ, అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శివసేన నిరసన
తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకున్న మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభను నల్లగొండలో అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుడు, శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ అన్నారు.ఈ మేరకు సోమవారం భువనగిరిలో నిరసన తెలిపారు. ఆయన వెంట నాయకులు బండారు సుమన, నేమిల శివ, సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.
సభను బహిష్కరించాలి
చౌటుప్పల్ టౌన: కృష్ణా జలాల సమస్యపై ప్రజలను మభ్య పెట్టేందుకు నల్లగొండలో బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న సభను రాజకీయాలకతీతంగా బహిష్కరించాలని డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ కోరారు. చౌటుప్పల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా నదిపై ప్రాజెక్ట్‌లు నిర్మించకుండా ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తడక కిరణ్, అమర్, గోశిక రవి, ఎండీ రహీం, పిల్లలమర్రి యాదగిరి ఉన్నారు.