కొమరయ్య త్యాగం చిరస్మరణీయం
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:17 AM
తెలంగాణ సాయు ధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివా రం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
సంస్థాన్ నారాయణపురం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయు ధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివా రం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దొడ్డి కొమరయ్య విగ్రహానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బూర నర్సయ్య గౌడ్ మా ట్లాడుతూ అణగారిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలంటే ముందుగా రాజకీయంగా బలోపేతం కావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య ఒక కులానికి చెందిన వాడు కాదని, అణచివేతకు గురైన అణగారిన వర్గాలకోసం పోరాడిన మహనీయుడన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ దోపిడీ దొరలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పోరాటం చేసిన యోధుడు కొమరయ్య అని, ఆయన ఆశయ సాధనకు కురుమలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. కురుమ సంఘం రాష్ట్రనేత క్యామ మల్లేశం మాట్లాడుతూ కురుమలు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది చట్టసభల్లో అడుగుపెట్టి తమ సత్తా చాటాలన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ రాష్ట్ర నేత చల్లమల్ల నర్సింహారెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు కనకాల శ్యాం తదితరులు మాట్లాడుతూ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చేసిన త్యాగాల ను కొనియాడారు. కార్యక్రమంలో నరి స్వామి, దోనూరు వీరారెడ్డి, నర్రి నరసింహ, రాజు, నరి రామలింగం, ఎట్టయ్య, నారాయణ, లింగస్వామి, ఐలయ్య, వెంకన్న మల్లయ్య, వెంకటయ్య, ఆంజనేయులు, మల్లేష్, జంగయ్య పాల్గొన్నారు