భూ నిర్వాసితులు అఽధైర్యపడొద్దు
ABN , Publish Date - Jun 29 , 2024 | 12:14 AM
చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన బాధిత భూ నిర్వాసితులు అధైర్య పడొద్దని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పునరావా సం కల్పిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మర్రిగూడ, జూన్ 28: చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన బాధిత భూ నిర్వాసితులు అధైర్య పడొద్దని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పునరావా సం కల్పిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. డిండి ఎత్తిపోతల పథకంలో, చర్లగూడ రిజర్వాయర్ కట్ట నిర్మాణంలో భాగంగా నర్సిరెడ్డి గ్రామం నుంచి వెళ్లే దారిని పూడ్చివేస్తుడటంతో రెండు రోజు ల నుంచి పనులను అడ్డుకున్న విష యం తెలిసిందే. స్పందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా ప్రాజెక్టు పనుల వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం కట్టవద్దకు వచ్చిన భూ నిర్వాసితులతో మాట్లాడి, సమస్యలు అడి గి తెలుసుకున్నారు. మీ సమస్యలు పరిష్కరించడంకోసమే వచ్చానని వారికి వివరించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని, పనులను మాత్రం అడ్డుకోవద్దని, పనుల కు సహకరించాలన్నారు. ఇప్పటికే మీకు అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేయడంకోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిలో రెండు, మూడు నెలల్లో ముఖ్యమంత్రిని ఒప్పించి పునరావాసం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి నర్సిరెడ్డిగూడెం నుంచి శివన్నగూడెం వెళ్లడానికి దారి ఏర్పాటు చేశామని సూచించారు. ముందుగా రిజర్వాయర్‌కు అతి సమీపంలో ఉన్న నర్సిరెడ్డిగూడెం ముంపునకు గురవుతున్నందున, చర్లగూడెం రిజర్వాయర్‌లో 289 ఇళ్లు ఉన్నాయని, వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ అధికారి రాములు, డీఈ కాశీంలతో మాట్లాడి రోడ్డు మ్యాపును పరిశీలించారు. ఆయనవెంట నిర్వాసితులు సత్తయ్య, ఏసుబ్, యాదయ్య, మంగమ్మ, పార్వతమ్మ, చంద్రయ్య, వెంకటయ్యగౌడ్, శ్రీనివా్‌సలతో పాటు ఎంపీపీ గండికోట రాజమణి, యాదయ్య, రాందాసు శ్రీనివాస్, రాపోలు యాదగిరి పాల్గొన్నారు.
గత ప్రభుత్వం చర్యలతోనే ప్రాజెక్టు పూర్తి కాలేదు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలతో చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కాలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రిజర్వాయర్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ, డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్ పనులు మొదలు పెట్టి పదేళ్లు పూర్తి కావొస్తున్నా, నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయో తెలియకుండా ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టు వర్షపు నీటితో నిండేది కాదని, ప్రాజెక్టు పూర్తయినా, ఇందులోకి నీరు రాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.6వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటివరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. త్వరలోనే రిజర్వాయర్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందన్నారు.