ఆర్‌ఆర్‌ఆర్‌కు భూములు ఇవ్వం
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:54 AM
ఆర్‌ఆర్‌ఆర్‌కు భూములు ఇవ్వబోమని నిర్వాసితులు తేల్చి చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో భాగంగా సోమవా రం భువనగిరి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అవార్డు సమావేశాన్ని రైతులు బహిష్కరించారు. భువనగిరి మండలంలోని తుక్కాపురం రెవెన్యూ పరిధిలో 37 మంది రైతులకు సంబంధించి 92 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి అవార్డు విచారణకు భువనగిరి ఆర్డీవో పి.అమరేందర్ హాజరయ్యారు.
సమావేశాన్ని బహిష్కరించిన రైతులు
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
భువనగిరి రూరల్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఆర్‌ఆర్‌కు భూములు ఇవ్వబోమని నిర్వాసితులు తేల్చి చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో భాగంగా సోమవా రం భువనగిరి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అవార్డు సమావేశాన్ని రైతులు బహిష్కరించారు. భువనగిరి మండలంలోని తుక్కాపురం రెవెన్యూ పరిధిలో 37 మంది రైతులకు సంబంధించి 92 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి అవార్డు విచారణకు భువనగిరి ఆర్డీవో పి.అమరేందర్ హాజరయ్యారు. సుమారు 5గంటలపాటు ఎదురు చూసినా రైతులు ఎవరూ హాజరుకాలేదు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని, తమ భూములను బలవంతంగా లాక్కుంటే ఆత్మహత్యకు పాల్పడతామని పేర్కొం టూ తుక్కాపురం గ్రామానికి చెందిన బాధిత రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాసిత రైతులు అవుశెట్టి పాండు యా దవ్, ఎలకొండ సంజీవరెడ్డి, అర్జున్ రెడ్డి, మేడి సురేశ్, కె.అంజిరెడ్డి, మల్లారెడ్డి, బాల్‌రెడ్డి, నోముల మహేందర్ రె డ్డి,కృష్ణారెడ్డి, జనగాం రమేశ్ పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైతే మేలు : పి.అమరేందర్, ఆర్డీవో
భూ నిర్వాసిత రైతులు అవార్డు విచారణకు హాజరై తమ భూములకు సంబంధించిన వివరాలు చెప్పాలని, తమ వద్ద ఉన్న రికార్డులతో వాటిని సరి చూసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. షెడ్యుల్ ప్రకారం అవార్డు సమావేశాలు నిర్వహిస్తున్నామని, సంబంధిత రైతులు హాజరు కాకపోతే నష్టపోయే అవకాశం ఉందన్నారు.