Share News

ఉదాహరణలతో పాఠాలు బోధించాలి

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:17 AM

ఉపాఽధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ఉదాహరణలతో పాఠ్యాంశాలు బోధించాలని ప్రముఖ ఆధ్యాతికవేత్త, ప్రవచనకారుడు డాక్టర్‌ గరికపాటి నర్సింహారావు కోరారు.

ఉదాహరణలతో పాఠాలు బోధించాలి

ప్రవచనకారుడు గరికపాటి నర్సింహారావు

ఆలేరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) ఉపాఽధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ఉదాహరణలతో పాఠ్యాంశాలు బోధించాలని ప్రముఖ ఆధ్యాతికవేత్త, ప్రవచనకారుడు డాక్టర్‌ గరికపాటి నర్సింహారావు కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో జరిగిన శారదామాత జయంతి ఉత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘విజ్ఞాన సమస్యలు,-తల్లిదండ్రుల పాత్ర’ అనే అంశంపై మాట్లాడారు. పిల్లలను సమగ్రంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర అతి ముఖ్యమైనదన్నారు. పదో తరగతి వరకు విద్యార్థులు తల్లి దండ్రుల వద్ద ఉంటూ చదవాలని కోరారు. ఉపాధ్యాయులు పాఠశాల పని వేళల్లోని చివరి గంటలో కఠినమైన పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. ముందుగా శారదామాత చిత్రపటానికి ఆయన పూలమాల వేసి జ్యోతి వెలి గించారు. కార్యక్రమం ప్రారంభించిన అనంతరం స్థానికులు ఆయనను పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బండిరాజుల శంకర్‌, వైస్‌ప్రిన్సిపల్‌ తరిగొప్పుల రమేష్‌, మాజీ సర్పంచులు ఆకావరం మోహనరావు, సందిల సురేష్‌, బందెల సుభాష్‌, మల్లేష్‌, శివమల్లు, సిద్ధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:17 AM