Share News

తులం ఇనుము కూడా ఇవ్వడు

ABN , Publish Date - May 24 , 2024 | 11:53 PM

తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా సీఎం రేవంతరెడ్డి ఇవ్వడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రేవంతరెడ్డి అన్నారు.

తులం ఇనుము కూడా ఇవ్వడు
దేవరకొండలో బీఆర్‌ఎస్‌ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కాంగ్రెస్‌ హామీలపై ఎద్దేవా

దేవరకొండ/ నకిరేకల్‌ / చౌటుప్పల్‌ రూరల్‌, మే 24 : తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా సీఎం రేవంతరెడ్డి ఇవ్వడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రేవంతరెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దేవరకొండ, నకిరేకల్‌, చౌటుప్పల్‌ మండలం దామెరలో నిర్వహించిన నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం బీఆర్‌ఎస్‌ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం నాట్లు వేసే సమయంలో రైతులకు రైతుబంధు ఇస్తే రేవంతరెడ్డి ప్రభుత్వం ఓట్ల సమయంలో ఇస్తోందని, అది కూడా పూర్తిస్థాయిలో రైతులకు రైతుబంధు ఇవ్వలేదన్నారు. మహిళలకు తులం బంగారం ఇస్తానని మాయమాటలు చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకే్‌షరెడ్డి విద్యావంతుడు, విదేశాల్లో ఉన్నత చదువులు చదివాడన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న మోసకాడని, బ్లాక్‌మెయిలర్‌ అని 74 రోజులు జైలులో గడిపాడని, అలాంటి వ్యక్తికి ఓటు వేయవద్దన్నారు. యూనివర్సిటీల్లోని ఒక్క నాయకుడికైనా కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే ప్రమాద హెచ్చరిక ఇచ్చినట్లుగా, బలమిస్తే సమస్యలపై కొట్లాడే బాధ్యత ఇచ్చినట్లవుతుందన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తానని, వృద్ధులకు రూ.4వేల పింఛన ఇస్తానని రేవంతరెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామంటున్న రేవంతరెడ్డి ఎన్నికల ముందు ఆ మాట ఎందుకు చెప్పలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గల్లా పట్టి హామీలు అమలు చేయిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టడంతో ప్రజలు మోసపోయారని మరోసారి కాంగ్రె్‌సకు ఓటు వేసి మోసపోవద్దని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లోనే మోసగాళ్లు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పాం, కానీ కాంగ్రెస్‌ మోసపు వాగ్ధానాలకు ప్రజలు మోసపోయారని విమర్శించారు. పాలిచ్చే గేదెకు గడ్డి వేయకుండా దున్నపోతుకు గడ్డి వేస్తే పాలిస్తుందని అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ సీఎంగా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేశాడన్నారు. 24 గంటలు ఉచిత కరెంట్‌, మిషనభగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంత్రిగా కేటీఆర్‌ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 50వేల పరిశ్రమలు తీసుకువచ్చి 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. విద్యావంతుడైన రాకే్‌షరెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.

దేవరకొండ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదరి కిషోర్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, వడ్త్య రమే్‌షనాయక్‌, నేనావత కిషననాయక్‌, కంకణాల వెంకట్‌రెడ్డి, రాజినేని వెంకటేశ్వరరావు, సుభా్‌షగౌడ్‌, గాజుల రాజేష్‌, తిరుపతయ్యతో పాటు నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

నకిరేకల్‌లో తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌, జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌, రాంబాబు, రాష్ట్ర గొర్రెల, మేకల కార్పొరేషన మాజీ చైర్మన దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్‌, నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.

చౌటుప్పల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు యాదాద్రిభువనగిరి జిల్లా జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, నాయకులు అంజయ్య, పల్లె రవికుమార్‌, ఇనచార్జి గోపగోని వెంకటనారాయణగౌడ్‌, కర్నాటి వెంకటేష్‌, గిర్కాటి నిరంజనగౌడ్‌, చింతల దామోదర్‌రెడ్డి, ఉప్పు కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:53 PM