దస్తావేజు లేఖరులకు లైసెన్స్లు మంజూరు చేయాలి
ABN , Publish Date - Feb 03 , 2024 | 11:07 PM
ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులకు లైసెన్స్లు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు నక్కా బాలు కోరారు.
హుజూర్నగర్, ఫిబ్రవరి 3 : ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులకు లైసెన్స్లు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు నక్కా బాలు కోరారు. శనివారం పట్టణంలో సబ్ రిజిసా్ట్రర్ షఫీకి దస్తావేజు లేఖరులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దస్తావేజుల లేఖరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అస్ర్ఫఅలీ, కాల్వ వీరేశ్వరరావు, కాలువ వెంకటేశ్వర్లు, మహ్మద్ అలీమ్ తదితరులు పాల్గొన్నారు.