ఆర్థిక సంస్కరణల మహనీయుడు
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:29 AM
మన్మోహన్‌సింగ్ దేశ ప్రధానిగా, ఆర్థికమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప మహనీయుడని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మన్మోహన్‌సింగ్ సేవలు అజరామరం
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
తుర్కపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మన్మోహన్‌సింగ్ దేశ ప్రధానిగా, ఆర్థికమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప మహనీయుడని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేసిన గొప్ప నా యకుడని, దేశం గర్వించదగ్గ పాలన అం దించారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ విన యానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూప మన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్య క్రమంలో ఆలేరు చైర్‌పర్సన్ చైతన్య మహేందర్‌రెడ్డి, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు యెలుగల రాజయ్య, మాజీ ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ ధానావతు శంకర్‌నాయక్, మాజీ ఎంపీటీసీ మోహన్‌బాబు, నాయకులు చాడ భా స్కర్‌రెడ్డి, దేవరుప్పల అయిలయ్య, యెలుగల వెంకన్న, బొత్త రాములు, బోరెడ్డి హన్మంతరెడ్డి, పనగట్ల సుదర్శన్, పాముల రాజు, మహిపాల్ రెడ్డి, పసుల సత్యనారాయణ, భూక్య రాజారాం నాయక్, గుండెబోయిన బాలుయాదవ్, పవన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.