Share News

గ్రామీణ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:19 AM

హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లోని రహదారులకు మహర్దశ కలుగనుంది.

గ్రామీణ రోడ్లకు మహర్దశ

రూ.40 కోట్లు మంజూరు చేయించిన మంత్రి ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లోని రహదారులకు మహర్దశ కలుగనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషితో 37.60 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో రూ.25 కోట్లతో 23.90 కిలోమీటర్లు, కోదాడ నియోజకవర్గంలో రూ.15 కోట్లతో 14.6 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నారు. ఇటీవల భారీవర్షాలకు గ్రామీణ రహదారులు శిథిలం కాగా వాటితో పాటు అంతర్గత రహదారుల నిర్మాణానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నిధులను మంజూరు చేయించారు.

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో

గడ్డిపల్లి నుంచి కోనాయగూడెం వరకు రూ.7.20 కోట్లతో ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డు, గరిడేపల్లి నుంచి సీతారాంతండా వరకు రూ.5.10 కోట్లతో ఐదు కిలోమీటర్లు, నేరేడుచర్ల మండలం దిర్శించర్ల నుంచి చిట్టివారిగూడెం వరకు రూ.3.20 కోట్లతో 2.90 కిలోమీటర్లు, కామాక్షికుంటతండా నుంచి చెన్నాయిపాలెం వరకు రూ.2.20 కోట్లతో రెండు కిలోమీటర్లు, బక్కమంతులగూడెం నుంచి అల్లిపురం వరకు రూ.3.10 కోట్లతో మూడు కిలోమీటర్లు, చౌటపల్లి నుంచి అల్లిపురం వరకు రూ.4.20 కోట్లతో నాలుగు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.

కోదాడ నియోజకవర్గంలో

మోతె మండలం నాయకన్‌గూడెం నుంచి విభలాపురం వరకు రూ.3.50 కోట్లతో 3.20 కిలోమీటర్లు, అన్నారిగూడెం మర్రిచెట్టు నుంచి కరక్కాయలగూడెం వరకు రూ.2.30 కోట్లతో రెండు కిలోమీటర్లు, నడిగూడెం మండలం వల్లాపురం నుంచి కేశవాపురం వరకు రూ.2 కోట్లతో రెండు కిలోమీటర్లు, నారాయణపురం నుంచి ఆర్‌కేసీపురం వరకు రూ.3.20 కోట్లతో 3.40 కిలోమీటర్లు, నామారం నుంచి సీతారాంపురం వరకు రూ.4 కోట్లతో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిల కృషితో నిధులు మంజూరు కావడంపై కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 17 , 2024 | 12:19 AM