పనిచేయని పాస్‌బుక్ ప్రింటింగ్ మిషన్లు
ABN , Publish Date - Jan 25 , 2024 | 12:07 AM
రైతుల పాస్‌పుస్తకాలలో వివరాలు పొందుపరిచేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాస్‌బుక్ ప్రింటింగ్ మిషనలు నెలలతరబడి పనిచేయడంలేదు.
డిండి, జనవరి 24: రైతుల పాస్‌పుస్తకాలలో వివరాలు పొందుపరిచేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాస్‌బుక్ ప్రింటింగ్ మిషనలు నెలలతరబడి పనిచేయడంలేదు. దేవరకొండ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పీఏపల్లి మండలం మినహా, ఏ ఒక్క తహసీల్దార్ కార్యాలయంలో ఈ మిషనలు పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం ఉన్న రైతు భూమి కొనుగోలు చేస్తే అదే పాస్‌పుస్తకంలో కొనుగోలు చేసిన అదనపు భూమి వివరాలను పొందపరిచి తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంది. కానీ నెలల తరబడి పాస్‌పుస్తకం ప్రింటింగ్ మిషన్లు పనిచేయకపోవడంతో డిండి మండలానికి చెందిన కొం దరు పీఏపల్లికి వెళ్లి ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై తహసీల్దార్ తిరుపతయ్యను వివరణ కోరగా చాలారోజులుగా మిషనలు పనిచేయడంలేదన్నారు.