కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:58 PM
భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
భూదానపోచంపల్లి, అక్టోబరు 1 : భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లి పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో జరిగింది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మీనవల్లు గ్రామానికి చెందిన చల్లా శివపార్వతి(20) వారి అమ్మమ్మవాళ్ల ఇంటిలో ఉండి చదువుకుంది. ఆ సమయంలో బంధువైన కృష్ణప్రసాద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమ వివాహానికి దారితీసింది. అక్కడ వివాహం చేసుకుని భూదానపోచంపల్లికి వచ్చి రక్షణ కల్పించాలని పోలీసులను శ్రయించారు. అయితే వారు భూదానపోచంపల్లిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో నివాసముంటున్నారు. భర్త కృష్ణప్రసాద్ ఓ కిరాణ దుకాణంలో పనిచేస్తున్నాడు. భార్యాభర్తలకు తరుచూ కుటుంబ కలహాలతో గొడవ పడుతున్నారని, ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన శివపార్వతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం సాయంత్రం ఉరివేసుకుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి సంఘటనాస్థలాన్ని చేరుకున్నారు. ఆర్‌ఐ వెంకట్‌రెడ్డితో పంచనామా నిర్వహించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్త ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా, భార్య మూడు నెలల గర్భవతి. ఆమెకు మంగళవారం మధ్యాహ్నం భర్త స్థానిక ఆస్పత్రిలో చూపించినట్లు తెలిపారు. తర్వాత పనికి వెళ్లాడు. ఆ తర్వాత ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు.