రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:01 AM
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వెబెక్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ని జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్‌స్పాట్స్ వద్ద చర్యలు చేపట్టాలన్నారు.
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట(కలెక్టరేట్), డిసెంబరు 28, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వెబెక్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ని జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్‌స్పాట్స్ వద్ద చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సూర్యాపేట పట్టణంలోని జనగాం క్రాస్‌రోడ్డు సమీపంలో జరుగుతున్న పనులతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను మళ్లించాలన్నారు. కోదాడ జాతీయ రహదారి ఎన్‌హెచ్-67వద్ద గల అప్రోచ్ రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మునిసిపాలిటీల పరిధిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. కోదాడ-మిర్యాలగూడ రోడ్డులో గోవిందాపురం గ్రామంతోపాటు మరికొన్ని మూలమలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు. కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో వేణుమాధవ్, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, డీఈ రాహుల్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. వచ్చే వేసవిలో ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ వీవీ అప్పారావు, ఆర్డీవో శ్రీనివాసులు, డీపీవో నారాయణరెడ్డి, డీఎంహెచ్‌వో కోటాచలం, డీడబ్ల్యూవో నరసింహారావు, డీఈవో అశోక్, పీఆర్‌డీఈ వెంకటయ్య, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో ఖాజా అజ్గర్ అలీ, ఎస్‌ఐ పరమేష్, మెడికల్ ఆఫీసర్ సీతామహాలక్ష్మి, వ్యవసాయాధికారి పద్మ తదితరులు పాల్గొన్నారు.