Share News

మర్రిగూడలో అందుబాటులోకి వైద్యసేవలు

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:19 AM

వైద్యులు లేక మూతబడిన ఆసుపత్రి వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది.

మర్రిగూడలో అందుబాటులోకి వైద్యసేవలు
శుక్రవారం తెరిచిన మర్రిగూడ ఆసుపత్రి

వైద్యులు లేక మూతబడిన మర్రిగూడ ఆసుపత్రి

నిలిచిన సేవలపై ఆంధ్రజ్యోతి మినీలో కథనం

ముగ్గురు వైద్యుల నియమించిన కలెక్టర్‌

శుక్రవారం కొనసాగిన వైద్యసేవలు

మర్రిగూడ, ఫిబ్రవరి 9 : వైద్యులు లేక మూతబడిన ఆసుపత్రి వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మర్రిగూడ ఆసుపత్రి దుస్థితిపై ‘డిప్యుటేషన్ల రద్దుతో మర్రిగూడ ఆస్పత్రి ఖాళీ’ శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. మర్రిగూడ 30 పడకల ఆసుపత్రిలో డిప్యూటేషన మీద వచ్చి 12మంది వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిప్యూటేషన్లు రద్దు చేస్తూ వైద్యులు ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్థలాలకు వెళ్లి వెద్యసేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మర్రిగూడ ఆసుపత్రిలోని 12 మంది వైద్యులు ఒకేసారి తన స్థానాలకు వెళ్లిపోయారు. దీంతో గురువారం వైద్యసేవలు నిలిచిపోయాయి. ఆసుపత్రిలో నిలిచిన సేవలపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్‌ హరిచందన స్పందించారు. ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు నిలిచిపోకుండా కొనసాగించాలని ఆదేశించారు. ఆ మేరకు శుక్రవారం ముగ్గురు వైద్యులను నియమించి తిరిగి వైద్యసేవలు అందేలా ఏర్పాటుచేశారు. వైద్యులు లేక మూతపడిన ఆసుపత్రి తలుపులు శుక్రవారం తెరుచుకోవడంతో రోగులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 10 , 2024 | 12:19 AM