Share News

మహిషాసురమర్ధినిగా దుర్గామాత

ABN , Publish Date - Oct 12 , 2024 | 12:46 AM

దుర్గాదేవి నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. శనివారం అమ్మవారు మహిశాసురమర్ధిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

 మహిషాసురమర్ధినిగా దుర్గామాత
ఆలేరులో పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ అయిలయ్య

ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌: దుర్గాదేవి నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. శనివారం అమ్మవారు మహిశాసురమర్ధిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భువనగిరిలో రోజంతా పూజలు కొనసాగాయి. అన్ని మండపాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది. శనివారం దసరా రోజున అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని మండపాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బీబీనగర్‌ పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆవరణలో, టీచర్స్‌ కాలనీ రోడ్డులో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాలను పలువురు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గోళి పింగల్‌ రెడ్డి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గోళి పింగల్‌ రెడ్డి, తాజామాజీ ఎంపీటీసీ గోళి నరేందర్‌ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్‌ గుప్తా, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. భూదానపోచంపల్లి పట్టణంలోని ఓల్డ్‌ సిటీ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో దుర్గా, శ్రీమహాలక్ష్మి, గణపతి మూల మంత్ర హోమం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో కమిటీ అధ్యక్షుడు అంకం సాయి, మిర్యాల భాస్కర్‌, వంగూరి భానుచందర్‌, కట్కూరి లింగస్వామి, చెరుకు వెంకటేష్‌, చెరుకు శ్రీకాంత, చేరాల శ్రీకాంత పాల్గొన్నారు. భీమనపల్లిలో హోమం నిర్వహించారు. ఆలేరు మండల కేంద్రంలోని భరతనగర్‌లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో, పటేల్‌గూడెంలో దుర్గా పూజలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణ పరదిధిలోని 7వ వార్డులో దుర్గామాత ఆలయంలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య శుక్రవారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రజలు సిరిసంపదలు, సకలసంతోషాలతో ఉండాలని మునిసిపల్‌ చైర్‌ప ర్సన ఎరుకల సుధాహేమెందర్‌గౌడ్‌, మల్లే్‌షయాదవ్‌, పేరబోయిన పెంటయ్య, గుండ్లపల్లి భరతగౌడ్‌ పాల్గొన్నారు. మోత్కూరులో విగ్నేష్‌ యూత ఆధ్వర్యంలో జరిగిన కుంకుమ పూజలో మునిసిపల్‌ కోఆప్షన సభ్యురాలు పోలినేని ఆనందమ్మ, సునీత, బుర్ర లక్ష్మీ, కల్లెం అరుణ, దబ్బెటి రాణి, బోయిని యాకలక్ష్మీ, సోని పాల్గొన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలోని సోమనాథ క్షేత్రంలో మహా చండీయాగాన్ని నిర్వహించారు. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన జిల్లా ఉపాధ్యక్షుడు మంచికంటి భాస్కర్‌గుప్త, సీహెచసీ రిటైర్డు సూపరిండెంట్‌ సికిలమెట్ల రాంప్రసాద్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన బత్తుల శ్రీశైలం, కాంగ్రెస్‌ పట్టణ ఇనచార్జ్‌ మొగుదాల రమేష్‌ గౌడ్‌, సోమనాథ క్షేత్రం కమిటీ అధ్యక్షుడు బడుగు నర్సింహ పాల్గొన్నారు. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులోని శివశక్తి శిర్డీసాయి అనుగ్రహ పీఠం రమణేశ్వరంలో రమణానందమహర్షి శ్రీచక్ర మహాప్రతిష్టలతో, వివిధ దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Oct 12 , 2024 | 12:46 AM