వ్యవసాయ యాంత్రీకరణలో కదలిక
ABN , Publish Date - Nov 15 , 2024 | 01:08 AM
ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆరేళ్లుగా నిలిచిం ది. దీంతో రైతులు ఆధునిక సాగుపై దృష్టిసారించే అవకా శం లేకుండాపోయింది.
గత ప్రభుత్వ హయాంలో ఆరేళ్లు నిలిచిన పథకం
రైతులకు రాయితీపై యంత్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యోచన
యాసంగి సీజన్ నుంచే అమలుకు ప్రణాళిక
త్వరలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రదర్శనలు
జిల్లాల వారీగా నివేదికల సేకరణ
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆరేళ్లుగా నిలిచిం ది. దీంతో రైతులు ఆధునిక సాగుపై దృష్టిసారించే అవకా శం లేకుండాపోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంత రం ఏర్పడిన గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం ప్రభుత్వం నాలుగేళ్ల పాటు వ్యవసాయ యాంత్రీకర ణ పథకాన్ని కొనసాగించింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాకు సుమారు రూ.50కోట్లు కేటాయించింది. యాంత్రీకరణ పథకంలో అత్యధికంగా ట్రాక్టర్లను మంజూరు చేశారు.
ఈ ట్రాక్టర్లు అధికంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇచ్చారనే ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వెలువెత్తడంతో పథ కం అబాసుపాలైంది. మరికొన్ని పరికరాలను కూ డా రాయితీపై ఇచ్చినా రైతులకు ఉపయోగం లేకుండాపోయింది. పథకం అమలు వివాదాస్ప దం కావడంతో అప్పటి 2018లో ఈ పథకాన్ని అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తరువాత రైతుల నుంచి రైతు సంఘాల నుంచి పథకం అ మలుకు డిమాండ్ వచ్చినా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఆరేళ్లుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఊసే లేదు.
యాసంగి నుంచి రాయితీపై యంత్రాలు?
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించమేగాక ఈ యాసంగిని నుంచే రాయితీపై రైతులకు యంత్రాలు అందజేయాలని నిర్ణయించింది. రైతులకు అవసరమైన ఉపకరణాలు, యంత్రాలను రాయితీపై సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ అధికారుల నుంచి నివేదికలు సేకరించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శితో పాటు డైరెక్టర్, ఇతర వ్యవసాయ అధికారులతో దీనిపై సమీక్ష కూడా నిర్వహించారు. రైతులకు అందజేయాల్సిన పనిముట్లు, యంత్ర పరికరాల జాబితాను కూడా రూపొందించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటర్‌వేటర్‌లు, నాగళ్లు, కల్టివేటర్లు, స్ర్పేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా మొక్కజొన్న సాగుచేస్తే వాటిని ఒలిచే యంత్రాలు కూడా పంపిణీ చేయనున్నారు.
త్వరలో ప్రదర్శనలు
వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు సం బంఽధించి రైతులకు అవగాహన కల్పించేందుకు త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులతో పాటు ప్రదర్శన ఏర్పాటుచేయనున్నారు. ఈ నెలాఖరులోగా అవగాహన సదస్సును నల్లగొండలో ఏర్పాటు చేసి సూర్యాపే ట, యాదాద్రి, నల్లగొండ జిల్లా రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పనిముట్లు, యంత్రాలు తయారు చేసే సంస్థల సహకారంతో రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సీజన్ ప్రారంభమైనందున త్వరితగతిన పనిముట్లు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో జరిగే అవగాహన సదస్సు లు, ప్రదర్శనలో వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రతినిధులను భాగస్వాములు చేయనున్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా అమలు చేసేందుకు సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అర్హులైన రైతులందరికీ వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించిన పనిముట్లను రాయితీపై ఇవ్వనున్నారు. అధికారులు ఏర్పాటు చేసే ప్రదర్శనలో అత్యధికంగా రైతులకు ప్రయోజనకరంగా ఉండే పనిముట్లను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన రెండు రోజులు నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. మందుల పిచికారీకి డ్రోన్‌లను కూడా ఉపయోగించే విధంగా అవగాహన కల్పించనున్నారు. మొత్తానికి ఆరేళ్ల తరువాత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ అమలుచేయనుండటంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
మార్గదర్శకాలు రాగానే అమలు చేస్తాం : పి.శ్రవణ్‌కుమార్, జేడీఏ
ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలులోకి తీసుకువస్తాం. త్వరలో ప్రభుత్వం విఽధివిధానాలు ఖరారు చేయనుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణతో రైతులకు మేలు కలగనుంది. ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు అధిక దిగబడులకు కూడా అవకాశం ఉంటుంది. యాంత్రీకరణ పరికరాల గురించి కొద్ది రోజుల్లో ఏర్పాటు చేసే ప్రదర్శనలో రైతులకు అవగాహన కల్పిస్తాం.