Share News

మూసీ పునరుజ్జీవం చారిత్రక అవసరం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:40 AM

మూసీ పునరుజ్జీవం చారిత్రక అవసరమని, మూసీ ప్రక్షాళన, సుందరీకరణను ప్రజలు కోరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.

మూసీ పునరుజ్జీవం చారిత్రక అవసరం

తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు

మోత్కూరు అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవం చారిత్రక అవసరమని, మూసీ ప్రక్షాళన, సుందరీకరణను ప్రజలు కోరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఈనెల 27న నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతానికి మంగళవారం హైదరాబాద్‌లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ ముఖ్యనాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అంతా స్వాగతించాలన్నారు. సీఎం చేస్తున్న అభివృద్ధిని చూసి, మనుగడ ఉండదని ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని నిర్మాణాత్మక సూచనలు చేయాలని హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కోసం ఈ నెల 27న అడ్డగూడూరు మండలం మానాయకుంట బ్రిడ్జి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మోత్కూరు, తిరుమలగిరి మునిసిపల్‌ చైర్‌పర్సన్లు గుర్రం కవిత లక్ష్మీనర్సింహారెడ్డి, శాగంటి అనసూర్య రాములు, మోత్కూరు, అడ్డగూడూరు సింగిల్‌విండో చైర్మన్లు పేలపూడి వెంకటేశ్వర్లు, కొప్పుల నిరంజన్‌రెడ్డి, నాయకులు వంగాల సత్యనారాయణ, పి.లింగయ్యయాదవ్‌ కందాడి సమరంరెడ్డి, తొడుసు లింగయ్య, జిల్లా నాయకులు పైళ్ల సోమిరెడ్డి, అశోక్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:40 AM