సమయపాలనపాటించాల్సిందే
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:59 AM
వైద్యు లు, సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాల్సిందేన ని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించి ఎంత మంది గైర్హాజరయ్యారని ఆరా తీశారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి :కలెక్టర్
భువనగిరిరూరల్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైద్యు లు, సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాల్సిందేన ని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించి ఎంత మంది గైర్హాజరయ్యారని ఆరా తీశారు. ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి ఎంతమంది పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నారోనని డీసీహెచ్‌వో డాక్టర్ చిన్నా నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు కావాల్సిన మందుల స్టాక్‌ను అడిగి తెలుసుకున్నారు. మం దుల కొరత లేకుండా అవసరమైన మందులను అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆసుపత్రిలో వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందుతుందని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని రోగులకు, సహాయకులకు సూచించారు. ఆయనవెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారాం, డీసీహెచ్‌వో డాక్టర్ చిన్నా నాయక్, వైద్యులు అనిల్‌కుమార్, కిరణ్, కరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
గైనకాలజిస్టు, ఫార్మసిస్టుకు షోకాజ్ నోటీసులు
జిల్లా కేంద్ర ఆసుపత్రిని కలెక్టర్ హనుమంతరావు శనివా రం ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా విధులకు గైర్హాజరైన వైద్యాధికారి, ఫార్మసిస్టులకు డీసీహెచ్‌వో డాక్టర్ చిన్నానాయక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రోగులకు అత్యవసర సేవలు అందించాల్సిన కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్టు డాక్టర్ ఎం.అరుణ జ్యోతి మూడు రోజులుగా, ఫార్మసిస్టు జి.లక్ష్మీనారాయణ రెండు రోజులుగా విధులకు రావడంలేదని గుర్తించారు. దీంతో రోగులకు వైద్య సేవలు అందించడంలో జరిగిన అసౌకర్యానికి బాధ్యులను చేస్తూ శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
మినహాయించిన ఆదాయపు పన్నును జమ చేయాలి
భువనగిరి (కలెక్టరేట్): తమకు వచ్చే పెన్షన్ నుంచి ఆదాయపు పన్ను కింద మినహాయించిన సొమ్మును వెంటనే ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాలని జిల్లా విశ్రాంత ఉద్యోగ సంఘం నేతలు కోరారు. శనివారం కలెక్టర్ ఎం.హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. తాము చెల్లించిన డబ్బు జమ కాకపోవడంతో నోటీసులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతకింది మల్లయ్య, పరిగెల రాములు, విశ్రాంత ఉద్యోగులు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, వంగపల్లి మల్లేషం, వంచ ఉపేందర్‌రెడ్డి, బల్ల దామోదర్, పటేల్ సుధాకర్ రెడ్డి, చిలుక వెంకటరామనర్సయ్య, వల్లా మధుసుధన్ తదితరులు పాల్గొన్నారు.