Share News

క్షేత్రపాలకుడికి శాసో్త్రక్తంగా నాగవల్లీదళార్చనలు

ABN , Publish Date - Feb 14 , 2024 | 12:34 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి.

క్షేత్రపాలకుడికి శాసో్త్రక్తంగా  నాగవల్లీదళార్చనలు
పాతగుట్ట ఆలయంలోని ఆంజనేయుడికి నాగవల్లీదళార్చనలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 13: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి, అనుబంధ పాతగుట్ట, శివాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామిని అర్చకస్వాములు వేదమంత్రాలతో పంచామృతాభిషేకం చేసి సింధూరం, వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు. ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు, అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, నిత్యతిరుకల్యాణం సంప్రదాయరీతిలో నిర్వహించారు. కొండపైన అనుబంధ ఆలయమైన శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలోని స్ఫటిక మూర్తులకు నిత్య పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.22,65,293 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - Feb 14 , 2024 | 12:34 AM