Share News

పథకాల అధ్యయనానికి నల్లగొండ వేదిక

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:00 AM

అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనానికి నల్లగొండ జిల్లా చక్కని వేదిక అని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. జిల్లాలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన 21 మంది ఆలిండియా సర్వీసెస్‌, సెంట్రల్‌ సర్వీసెస్‌ ప్రొబేషనరీ అధికారుల బృందం సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుంది.

పథకాల అధ్యయనానికి నల్లగొండ వేదిక

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

నల్లగొండ టౌన్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనానికి నల్లగొండ జిల్లా చక్కని వేదిక అని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. జిల్లాలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన 21 మంది ఆలిండియా సర్వీసెస్‌, సెంట్రల్‌ సర్వీసెస్‌ ప్రొబేషనరీ అధికారుల బృందం సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుంది. వారితో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం లో నల్లగొండ జిల్లా పెద్దదని, 33 మండలాలు, నాలుగు రెవెన్యూ రెవె న్యూ డివిజన్లతో ఏర్పాటైందని వివరించారు. జిల్లాలో వ్యవసాయం ప్రధా న జీవనాధారమని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలుచేస్తున్నామన్నారు. వీటిని అధ్యయనం చేసేందుకు మారుమూలగ్రామీణ ప్రాంతాలతో పాటు, మునిసిపల్‌, పట్టణ ప్రాంతాలు జిల్లాలో ఉన్నందున ఇది ప్రొబేషనరీ బృందానికి చక్కగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్ర, స్పెషల్‌ కలెక్టర్‌ నటరాజ్‌, జిల్లా పరిశ్రమలశాఖ జేడీ కోటేశ్వర్‌రావు, హౌసింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను వేగవంతం చేయాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ‘ప్రజావాణి’లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా, మొత్తం 63 ఫిర్యాదులు వచ్చాయి.

కర్నాటిపల్లి పంచాయతీలో ట్రైనీ ఐఏఎ్‌సల బృందం

దేవరకొండ: దేవరకొండ మండలం కర్నాటిపల్లి గ్రామానికి సోమవారం ఐదుగురు ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు చేరుకున్నారు. ఈనెల 25వరకు వారు పంచాయతీలోనే ఉండి ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలు తదితర విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఈ బృందానికి ఎంపీడీవో డానియెల్‌, తహసీల్దార్‌ సంతో్‌షకిరణ్‌, పలు శాఖల అధికారులు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.

Updated Date - Oct 22 , 2024 | 01:00 AM