Share News

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదు

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:58 PM

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదు
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న జగదీ్‌షరెడ్డి

ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

తుంగతుర్తి,ఫిబ్రవరి7 : కేసీఆర్‌ను ముట్టుకోవడం ఎవరితరం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల సమావేశంలో భాగంగా బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఫంక్షన హాల్‌లో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనా అనుభవ రాహిత్యంతో కృష్ణానదిపై ఉన్న హక్కులను కేంద్రప్రభుత్వ ఒత్తిడితో కేఆర్‌ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అప్పగించారని ఎద్దేవాచేశారు. నాడు తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్‌ నేడు తెలంగాణ హక్కుల కోసం పో రాటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈనెల 13న నల్లగొండలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నియామకాల కోసమని మళ్లీ నీళ్ల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తేవడానికి కేసీఆర్‌ తలవంచలేదని, అవసరమైతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం కానీ ప్రాజెక్టులను వదులుకోలేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచామన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. నల్లగొండలో జరిగే సభను కొందరు అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమా ర్‌, జడ్పీ చైర్‌పర్సన గుజ్జ దీపికయుగేంధర్‌రావు మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలు చేసి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సి న బాధ్యత ప్రతీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్ల పెంపు, రూ.2లక్షల రుణమాఫీ, గృహఅవసరాలకు ఉచిత విద్యుత ఏమైందని ప్రశ్నించారు. సమావేశంలో భువనగిరి జిల్లా పరిషత చైర్మన ఎలిమినేటి సందీ్‌పరె డ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రవీందర్‌సింగ్‌, కంచర్ల రామకృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, రజాక్‌, తాటికొండ సీతయ్య, గుడిపాటి సైదులు, కవితరాములుగౌడ్‌, పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:58 PM