Share News

అతివేగం..అజాగ్రత్త వద్దు

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:50 AM

అతివేగం... రహదారి నియమాలపై అవగాహన లోపం... అజాగ్రత... రోడ్డు క్రాసింగ్‌లో అప్రమత్తత లోపం... రాంగ్‌ పార్కింగ్‌ యాదగిరిగుట్ట పోలీస్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

 అతివేగం..అజాగ్రత్త వద్దు

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

గత ఏడాదికంటే పెరిగిన సైబర్‌ నేరాలు

యాదగిరిగుట్ట రూరల్‌, డిసెంబరు 30, (ఆంద్రజ్యోతి): అతివేగం... రహదారి నియమాలపై అవగాహన లోపం... అజాగ్రత... రోడ్డు క్రాసింగ్‌లో అప్రమత్తత లోపం... రాంగ్‌ పార్కింగ్‌ యాదగిరిగుట్ట పోలీస్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. స్థానిక పోలీసులు ప్రమాదాలు నివారించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ యాదగిరిగుట్ట మండలంలో గత ఏడాదికంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది. మృతుల సంఖ్య కొంతవరకు తగ్గింది. గత ఏడాది పోల్చితే దొంగతనాలు తగ్గగా, సైబర్‌ నేరాల సంఖ్య పెరిగింది. మత్తు పదార్థాల పట్టివేత సంఖ్య కొంత తగ్గింది.

ప్రమాదాలు జరిగే ప్రదేశాల గుర్తింపు

యాదగిరిగుట్ట పీఎస్‌ పరిధిలో 163 జాతీయ రహదారి వంగపల్లి నుంచి కాకతీయ కమాన్‌ వరకు 21కిలో మీటర్లు విస్తరించి ఉంది. ఈ జాతీయ రహదారిపై వంగపల్లి ఎంట్రీ, ఎగ్జిట్‌ మోటకొండూర్‌ ఎక్స్‌రోడ్‌, తాళ్లగూడెం బ్రిడ్జి, బాహుపేట ఎక్స్‌రోడ్డు, ఆలేరు ఎంట్రీ ఏరియాల్లో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించారు. వాటర్‌ బ్యారియల్స్‌ ఏర్పాటు, కల్వర్టు దగ్గర రేడియం స్టిక్కర్స్‌ ఏర్పాటు, హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేశారు. వంగపల్లి బ్రిడ్జి దగ్గర రంబుల్స్‌ స్టిఫ్స్‌, ప్రమాదకర సూచిక బోర్డులు ఏర్పాడు చేశారు. హైవే పెట్రోలింగ్‌ ఏర్పాటుతో రాంగ్‌ పార్కింగ్‌ చేస్తున్న వాహనపై అపరాద రుసం విధించడంతో పాటుగా బ్రేక్‌డౌన్‌ వాహనాలను వెంటనే మెకానిక్‌ పిలిపించి రిపేర్‌ చేయించి ప్రమాదాలు జరిగిన వాహనాలను వెంటనే క్రేన్‌ద్వారా తొలగించి మరోప్రమాదం జరిగకుండా చూడటం, పండుగలకు వెళుతున్న వాహనదారులకు ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించడంతో క్రమేణ రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ప్రమాదాలకు కారణాలు చూపినట్ట్లైతే ఈ జాతీయ రహదారిపై వాహనాలు హైస్పీడ్‌ లిమిట్‌ 80ఉంటే వాహనాదారులు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో నడిపిస్తూ రోడ్డు నియమాల అవగాహన లోపం, అజాగ్రత్తతో నడపుతుండడం, మద్యం సేవించి వాహనాలను నడపడం, గ్రామీ ణ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కవ శాతం బావుల వద ్దకు వెళ్లే ముందు అజాగ్రత్తగా రోడ్డు క్రాస్‌ చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తాం

ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్డు సేఫ్టీ అథారిటీ అధికారులతో చర్చించి ప్రమాదాలు తగ్గించేవిధంగా చర్యలు తీసుకుంటు న్నాం. గ్రామాల్లో ప్రమాదాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా వేగనియంత్రణ పాటించేలా చైతన్యం చేస్తున్నాం.

-యలగొండ కృష్ణ, ట్రాఫిక్‌ సీఐ, యాదగిరిగుట్ట

Updated Date - Dec 31 , 2024 | 12:50 AM