గుట్టలో పనిచేయని ఏటీఎంలు
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:38 AM
నిరంతరం భక్తులతో రద్దీగా యాదగిరిగుట్ట పట్టణంలో ఏటీఎం(ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన)లు పని చేయడంలేదు. అత్యవసర సమయాల్లో నగదును తీసుకోవడానికి ఏటీఎంలు నిరంతరం మూసి ఉండడంతో భక్తులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
అందుబాటులోకి రాని సీడీఎం సేవలు
ఇబ్బందిపడుతున్న స్థానికులు, భక్తులు
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నిరంతరం భక్తులతో రద్దీగా యాదగిరిగుట్ట పట్టణంలో ఏటీఎం(ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన)లు పని చేయడంలేదు. అత్యవసర సమయాల్లో నగదును తీసుకోవడానికి ఏటీఎంలు నిరంతరం మూసి ఉండడంతో భక్తులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. నగదును ఇతరుల ఖాతాలకు జమ చేసేందుకు ఏర్పాటుచేసిన సీడీఎం(క్యాష్ డిపాజిట్ మిషన) మిషన్లను అందుబాటులోకి తేలేదు. ఈ విషయమై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియడంలేదని పలువురు స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో సుమారు 30వేల మంది జానాబా కలిగి ఉండగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ప్రతినిత్యం సుమారు 35వేల మంది భక్తులు దర్శనం చేసుకొని వెళుతుంటారు. పట్టణంలో ఇప్పటి వరకు 10బ్యాంకులు ఉన్నాయి. ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకు, కరూర్, గాయిత్రి, సెంట్రల్, ఇండియన్, సీడీఎం, కో ఆపరేటివ్, నాగార్జున బ్యాంకులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతీ బ్యాంకు తమ తమ వినియోగదారులు, స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు కోసం అత్యవసర సమయాల్లో నగదును డ్రా చేయడానికి, ఇతరులకు పంపించడానికి డిజిటల్ ఆన్‌లైన్ ద్వార ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మధ్య కాలంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో కేవలం ఒకటిరెండు ఏటీఎం మాత్రమే వినియోగంలో ఉండగా ఏడు ఏటీఎంలు పనిచేయడంలేదు.
సెలవు రోజుల్లో అధిక ఇబ్బందులు
శని, ఆదివారాల్లో, ఇతర సెలవు రోజుల్లో స్వామిని దర్శించుకోవడానికి యాదగిరిగుట్ట క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. బ్యాంకులు మూసివేయడం, ఏటీఎంలు మూసి ఉంచడం, ఉన్న ఏటీఎంల్లో నగదు లేకపోవడం వంటి పరిస్థితులు భక్తులకు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితితో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారాంతపు సెలవుల సమయంలో, ఇతర సెలవుల సమయంలో ఏటీఎంల్లో నగదును అధికంగా అందుబాటులో ఉంచాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
సీడీఎం సేవలను అందుబాటులోకి తేవాలి
పర్యటక కేంద్రమైన యాదగిరిగుట్ట పట్టనంలో ఇప్పటి వరకు ఏఒక్క బ్యాంకు కూడా సీడీఎం(క్యాష్ డిపాజిట్ మెషిన) సేవలను అందుబాటులోకి తీసుకరాలేదు. దీంతో నగదును కుటుంబ సభ్యులు, వ్యాపారాలు, అత్యవసర వైద్య సేవలకోసం పంపించడానికి స్థానికులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ జనాభాను, భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వెంటనే సీడీఎం మిషన్లను ఏర్పాటు చేయాలి. పనిచేయని ఏటీఎంలకు మరమ్మతులు చేసి, అందుబాటులోకి తేవాలి.
-పల్లెపాటి బాలయ్య, యాదగిరిగుట్ట వాసి
త్వరలో సీడీఎం మిషన ఏర్పాటు చేస్తాం
యాదగిరిగుట్ట పట్టణంలో భక్తుల రద్దీ, స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం డిజిటల్, ఆన్‌లైన్ సేవలలో భాగంగా త్వరలో తమ బ్యాంకు ద్వారా సీడీఎం మిషన్ ఏర్పాటు చేస్తాం. మిషన్ ద్వారా డైరెక్టుగా డబ్బలు తీసుకోవడానికి, డిపాజిట్ చేయడానికి అత్యవస సమయాల్లో ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఏటీఎంల సేవలు తమ బ్యాంకులవి అందుబాటులో ఉంటే ఆ బ్యాంకు పర్యమేక్షణ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే వారే పర్యవేక్షణ చేస్తారు. అన్ని సేవలూ ఆర్బీఐ నియమాల ప్రకారంగా నిర్వహించాలి.
-సత్తయ్య, యూనియన్ బ్యాంకు మేనేజర్, యాదగిరిగుట్ట