Share News

వంద మందిలో ఒకడు

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:29 AM

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ క్విజ్‌ పోటీల్లో కోదాడకు చెందిన తేజ పాఠశాల విద్యార్థి గుజ్జుల హర్షవర్ధనరెడ్డి విజేతగా నిలిచాడు. దేశవ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 30 వరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్‌-2024 పేరున పోటీ నిర్వహించింది.

వంద మందిలో ఒకడు
హర్షవర్దనరెడ్డిని అభినందిస్తున్న రమాదేవి

జాతీయ అంతరిక్ష క్విజ్‌ పోటీ విజేతల్లో కోదాడ తేజ విద్యాలయ విద్యార్థి హర్షవర్దనరెడ్డి

దేశవ్యాప్తంగా 100 మంది విద్యార్థుల ఎంపిక

విజేతలకు ఇస్రో సందర్శనకు అవకాశం

కోదాడ రూరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ క్విజ్‌ పోటీల్లో కోదాడకు చెందిన తేజ పాఠశాల విద్యార్థి గుజ్జుల హర్షవర్ధనరెడ్డి విజేతగా నిలిచాడు. దేశవ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 30 వరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్‌-2024 పేరున పోటీ నిర్వహించింది. ఈ పోటీలో 3,66,308 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 100 మందిని ఎంపిక చేసి వారికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన అంతరిక్ష రాకెట్‌ ప్రయోగ కేంద్రం శ్రీహరికోటను సందర్శించే అవకాశం కల్పించారు. ఈ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొనగా, వీరిలో 7వ తరగతి విద్యార్థి గుజ్జుల హర్షవర్ధనరెడ్డి 100మందిలో నిలిచినట్లు కొమరబండ తేజ విద్యాలయ ప్రిన్సిపాల్‌ రమా సోమిరెడ్డి తెలిపారు. ఈ నెల 23వ తేదీన శ్రీహరికోటను సందర్శించే బృందంలో స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో హర్షవర్ధనరెడ్డిని అభినందించారు. హర్షవర్ధనరెడ్డితో పాటు వెళ్లే వారికి ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యం ఇస్రో కల్పిస్తుందన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:29 AM