సర్వేలో భాగస్వామ్యంకావాలి
ABN , Publish Date - Nov 03 , 2024 | 12:45 AM
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బీసీ కుల గణన సర్వే కార్యక్రమం లో కాంగ్రెస్ శ్రేణులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఆలేరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బీసీ కుల గణన సర్వే కార్యక్రమం లో కాంగ్రెస్ శ్రేణులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. శనివారం ఆలేరులో కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కుల గణన సర్వేపై అవగాహ న సదస్సులో వారు మాట్లాడారు. కుల గణన సర్వేను చేపడుతున్న ఘనత కాంగ్రె్‌సకే దక్కిందన్నారు. 90ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిల ఆధ్వర్యంలో చేపట్టడం హర్షనీయమని, ఈ సర్వేతో బీసీలలో అణగారిన కులాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. సర్వేకు బీసీ కులాలకు చెందిన ప్రతీ కుటుంబం సామాజిక స్థితి, ఆదాయం, విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, భూ యాజమాన్యం, రాజకీయ అంశాలను మదింపు చేయడం ఈ సర్వే లక్ష్యమన్నారు. ఈ కులగణన సర్వేను మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ప్రారంభిం చి దేశానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. పార్టీలకతీతంగా కుల గణన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పశ్చిమట్ల మదార్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి, భువనగిరి మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, డీసీసీ జనరల్ సెక్రటరీ పోత్నక్ ప్రమోద్‌కుమార్, నాయకులు శంకర్‌నాయక్, చిలుకు కిష్టయ్య, సముద్రాల సత్యం, వనజా రాంరెడ్డి, గంధమల్ల అశోక్, శ్రీశైలం, చాడ భాస్కర్‌రెడ్డి, చింతలఫణి శ్రీనివా్‌సరెడ్డి, ఎంఏ ఎజాజ్, ఎండీ సలీం, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, మల్లేశం, కూళ్ల నర్సింహులు, దూడల రమేష్, ఉమాదేవి, దూడల అనిత, హేమేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.