Share News

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి బాటలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:54 AM

గడచిపోతున్న 2024 సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త అభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేలా ఇరిగేషన్‌ విధానా న్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, మరోవైపు మౌలిక వనరుల కల్పనా రంగానికి శ్రీకారం చుట్టింది.

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి బాటలు

నెరవేరిన బ్రాహ్మణవెల్లెంల కల, రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన సీఎం రేవంత్‌, మంత్రి వెంకటరెడ్డి

వెలుగు జిలుగుల యాదాద్రి ప్రారంభం

నల్లగొండలో మెడికల్‌ కళాశాల ప్రారంభం, నర్సింగ్‌ క ళాశాలకు శంకుస్థాపన

ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల పథకాలకు డెడ్‌లైన్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ) : గడచిపోతున్న 2024 సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త అభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేలా ఇరిగేషన్‌ విధానా న్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, మరోవైపు మౌలిక వనరుల కల్పనా రంగానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు చెందిన భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లతో సమన్వ యం చేసుకుంటూ జిల్లాలో ఈ ఏడాదం తా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీ కారంచుట్టారు. ప్రధానంగా ఎస్‌ఎల్‌బీసీ పూర్తికి కార్యాచరణ ప్రకటించగా, డిండి లిఫ్టు, మూసీ కాల్వలకు భారీగా నిధులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో సీఎంఇచ్చిన హామీ మేరకు మూసీ ప్రక్షాళ న ప్రాజెక్టును చేపట్టారు.

జిల్లాలోని నకిరేకల్‌, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో లక్ష ఎకరాలకు సాగునీరిచ్చే ఉదయసము ద్రం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం కల ఈ ఏడాది లో సాకారమైంది. ఈ ప్రాజెక్టు పైలాన్‌ని సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ ఏడో తేదీన ఆవిష్కరించారు. పైలాన్‌ ఆవిష్కరణతోపాటు బ్రాహ్మణవెల్లంల రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన సీఎం అక్కడ గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఫ్లోరోసి్‌సతో బాధపడే తన సొంత గ్రామంతోపాటు మూడు నియోజకవర్గాల్లోని ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు 2007లో అప్పటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఎమ్మార్పీ ద్వారా బ్రాహ్మణవెల్లంలకు నీటిని తీసుకొచ్చి ఇక్కడ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి తద్వారా ఇక్కడి నుంచి లక్ష ఎకరాల కు నీరివ్వాలనే పథకానికి రూపకల్పన చేశారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి ఈ పథకానికి రూ.699కోట్ల నిధులు మంజూరు చేయించడమేకాక అప్పటి సీఎం వైఎ్‌సఆర్‌తో శంకుస్థాపన చేయించారు. 2013 వరకు పనులు వేగంగా సాగినా పథకం పూర్తికాలేదు. అనంతరం గత పదేళ్లలో ఈ పథకం ముందుకు సాగలేదు. గత ఎన్నికలకు ముందు పంపుహౌస్‌, లిఫ్టుల పనులు పూర్తిచేసి ట్రయల్‌రన్‌ నిర్వహించినా, రిజర్వాయర్‌, కాల్వల పనులు అలాగే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక ఈ పథకానికి రూ.100కోట్లు కేటాయించి పెండింగ్‌ పనులు పూర్తిచేయించి ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. లక్ష ఎకరాలకు నిర్దేశించిన బ్రాహ్మణవెల్లంల, ఉదయసముద్రం ఎత్తిపోతల పథ కం కింద మొదటి దశలో 48,972 ఎకరాలకు ఈ ఏడాది నీరిచ్చేందుకు నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన భూ సేకరణ పనులను నకిరేకల్‌, నల్లగొండ నియోజకవర్గాల్లో చేపట్టారు. కాల్వల తవ్వకాల పనులు వేగంగా సాగుతున్నాయి.

నల్లగొండలో వైద్య కళాశాల ప్రారంభం

నల్లగొండ జిల్లాకేంద్రంలోని గంధంవారిగూడెం వద్ద 42 ఎకరాల్లో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి 2022ఆగస్టులో శంకుస్థాపన చేసి పనులు చేపట్టగా, 2024, డిసెంబరు 7వ తేదీన ఈ భవనసముదాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కళాశాల భవన సముదాయం గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మూడు అంతస్తులు, బాలికల వసతి గృహం గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు అయిదంతస్తులు, బాలుర వసతి గృహం గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు అయిదంతస్తు లు నిర్మించారు. వీటితోపాటు ప్రిన్సిపల్‌ క్వార్టర్స్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు మూడు అంతస్తులు నిర్మించారు. క్యాంటిన్‌ ప్ర త్యేకంగా అందుబాటులో ఉంచారు. ప్రహరీ, పార్కింగ్‌ స దుపాయాలు కల్పించారు. ప్రాంగణమంతా గ్రీనరీ, చెట్లతో కళకళలాడుతోంది. ఇదే ప్రాంగణంలో రూ.400కోట్లతో నర్సింగ్‌ కళాశాలకు కూడా శంకుస్థాపన చేశారు.

రూ.5వేల కోట్లతో రోడ్ల విస్తరణ

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించా రు. జిల్లాలో మొత్తం సుమారు రూ.5వేల కోట్లతో రోడ్ల కు అనుమతులు మంజూరు చేశారు. జిల్లాలో ప్రతీ మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌రోడ్డు, ప్రతీ గ్రామం నుంచి మండలం కేంద్రానికి బీటీరోడ్డును మం జూరుచేశారు. జిల్లాలోని కీలకమైన రహహదారులన్నింటికీ నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. చిట్యాల-భువనగిరి రోడ్డును జాతీయరహదారిగా చేపట్టాలని కేంద్రానికి విన్నవించగా, నల్లగొండలో రింగ్‌రోడ్డుకు రూ.450కోట్లు కేటాయించారు. అదేవిధంగా రీజినల్‌ రింగురోడ్డు దక్షిణభాగాన్ని మంజూరు చేయించిన పనులకు శ్రీకారం చుట్టారు. కీలకమైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులను కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయించారు. మిర్యాలగూడలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపైన నాలుగు చోట్ల అండర్‌పా్‌సవేలకు శంకుస్థాపనలు చేశారు. మొత్తంగా రోడ్ల పనులు భారీగా నిధులిస్తుండడంతో జిల్లా రోడ్లకు మహర్దశ పట్టనుంది.

యాదాద్రి థర్మల్‌పవర్‌ స్టేషన్‌ జాతికి అంకితం

నాలుగువేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తోన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో విద్యుదుత్పాద న ప్రక్రియని ఈ డిసెంబరు ఏడో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. వైటీపీఎ్‌స లో తొలిదశలో 800 మెగావాట్ల యూనిట్‌-2నుంచి విద్యుదుత్పాదన మొదలైంది. మొత్తం అయిదు యూనిట్లుగా చేపట్టిన యాదాద్రి పవర్‌ప్లాంటులో డిసెంబర్‌లో యూనిట్‌-2 విద్యుదుత్పాదన మొదలవగా, యూనిట్‌-1 కూడా విద్యుదుత్పాదనకు సిద్ధమైంది. మిగిలిన మూడు యూనిట్లు కూడా దాదాపు 85శాతం పనులు పూర్తయ్యాయి. 8.8 కిలోమీటర్ల రైల్వేలైన్‌ కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ట్రాక్‌ పర్మిషన్‌ మంజూరుచేసి, బొగ్గురవాణాకు రెండు వ్యాగన్లు కేటాయించారు. పవర్‌ప్లాంట్‌ వద్ద ఇతర అన్ని పనులు పూర్తిచేయడంతోపాటు, ఉద్యోగులు, అధికారులు, కార్మికుల నివాస నిమిత్తం తుంగపాడుబంధం-కృష్ణానది సంగమం వద్ద ప్రత్యేకంగా కాలనీని భారీ టవర్లతో ఏర్పాటు చేస్తున్నారు. దామరచర్ల నుంచి పవర్‌ప్లాంట్‌ వరకు, అక్కడినుంచి తుంగపాడు వాగు పక్కగా నూతనంగా నిర్మించే కాలనీ వరకు ప్రత్యేక రోడ్లను సైతం వేసేందుకు నిధులు మంజూరుచేశారు. ఈ పనులన్నింటీనీ వచ్చే ఏడాదిలో పూర్తిచేయాలని, 2025 మే నాటికి మొత్తం ప్లాంటు వినియోగంలోకి తెచ్చేలా పనులు చేస్తున్నారు. అయితే ఇక్కడ భూములు, ఇళ్లు కోల్పోయిన సుమారు 558 మంది నిర్వాసితులకు ఇంకా ఉద్యోగాల కల్పన జరగలేదు.

ఎస్‌ఎల్‌బీసీ, డిండిఎత్తిపోతల పథకాలకు డెడ్‌లైన్లు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వరప్రదాయిని.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులను 2027 సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని డెడ్‌లైన్‌ విధించారు. ఈ పనులకు అవసరమైన టన్నెల్‌బోరింగ్‌ మిషన్‌లో ఉపయోగించే బేరింగ్‌ని అమెరికానుంచి తెప్పించేందుకు ఒప్పందం చేసుకోగా, మార్చి నుంచి ఇవన్నీ అందుబాటులోకి వచ్చి పనులు మొదలవుతాయని పేర్కొంటున్నారు. ఈ పథకం పూర్తికి అవసరమైన రూ.4,460కోట్ల నిధులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ పథకం పూర్తయితే బ్రాహ్మణవెల్లంల కలుపుకొని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. అదేవిధంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా రాబోయేమూడేళ్లలో పూర్తిచేయాలని, ఈ పథకానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లో అంతర్భాగమైన ఏదుల నుంచి నీటిని సేకరించాలని నిర్ణయించి, పనులకు టెండర్లను ఆహ్వానించారు.

ఎత్తిపోతల పథకాలన్నింటినీ ఏడాదిలో పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న చిన్ననీటి ఎత్తిపోతల పథకాలు (మినీ లిఫ్టులు) అన్నింటినీ పునరుద్ధరించడంతోపాటు, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, కోదా డ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న లిఫ్టులను వచ్చే ఆగస్టు నాటికి పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. అందుకోసం రూ.500 కోట్ల నిధులను మంజూరు చేశారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాల నిర్వహణలో ఎదురవుతున్న లష్కర్లు, ఆపరేటర్ల సమస్యను పరిష్కరించేందుకు మంత్రి ప్రత్యేక కార్యాచరణ అమల్లోకి తెచ్చారు. లష్కర్ల నియామకాలకు నోటిఫికే షన్‌ విడుదలచే శారు. లిఫ్టులను క్లస్టర్లుగా మార్చి ఆపరేటర్లు, డ్రాఫ్ట్‌మెన్‌ని నియమించాలని కమిటీలకు ఆదేశాలిచ్చారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ప్రతీ ఎకరాకు సాగునీరివ్వడమే ఏకైక లక్ష్యంగా పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు. మూసీ నదిపై ఉన్న బీమలింగం కత్వ, అసి్‌ఫనహర్‌కాల్వ, ధర్మారెడ్డికాల్వ, పిలాయిపల్లి కాల్వల పునరుద్ధరణకు కూడా రూ.524కోట్లు మంజూరు చేసిపనులు చేపట్టారు.

జిల్లాలో ఆరు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు

ఉపాధి కల్పనే ధ్యేయంగా ఐటీఐల స్థానంలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాట్లుచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ బాలుర ఐటీఐ, బాలికల ఐటీఐతోపాటు భువనగిరి, ఆలేరు, డిండి, హాలియా, హుజూర్‌నగర్‌లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. ఆరు ఆధునిక కోర్సులతో ఈ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.40కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా నల్లగొండలో సెట్విన్‌ సహకారంతో స్కిల్‌డెవల్‌పమెంట్‌ సెంట ర్‌ ఏర్పాటు చేయగా, ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌డెవల్‌పమెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులిచ్చారు. వీటితోపాటు స్కూళ్లలో మౌలిక సదుపాయా ల కల్పనకు రూ.48కోట్లు కేటాయించారు. అదేవిధంగా నల్లగొండ, మునుగోడు, హుజూర్‌నగర్‌లలో ఇంటిగ్రేడెట్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లక శంకుస్థాపనలు చేశారు.

Updated Date - Dec 29 , 2024 | 12:54 AM