Share News

ప్రభుత్వ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:14 AM

Pattadaru passbooks should be given for government land

 ప్రభుత్వ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలి
రైతులతో మాట్లాడుతున్న నర్సింహ

భువనగిరి రూరల్‌, జూలై 25: దళితులు సేద్యం చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం భువనగిరి మండలం హన్మాపురంలో సర్వే నెంబర్‌ 87లో 15ఎకరాల 11గుంటల భూమిలో దళితులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని సీపీఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహతో కలిసి పరిశీలించారు. ఈ భూమిలో 14 దళిత కుటుంబాలకు చెందిన 29మంది ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ విద్యుత కనెక్షన పొంది, బోరు మోటార్లను వినియోగించి సాగు చేసుకుంటున్నాయన్నారు. వీరందరికి వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అనంతరం నూతన పాస్‌పుస్తకాల సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.మహేందర్‌, ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజు, గౌరవ అధ్యక్షుడిగా ఎం.అంజయ్య, ఉపాధ్యక్షులుగా బి.రామచంద్రు, సహాయ కార్యదర్శులు మల్లయ్య, వెంకటయ్య, మైసయ్య, బాలనర్సింహను ఎన్నుకున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:14 AM