Share News

ఎంఎంటీఎ్‌సకు మార్గం సుగమం

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:55 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకు నే భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి(యాదాద్రి) రైల్వేస్టేషన్‌ వరకు ఎంఎంటీఎస్‌ (హైదరాబా ద్‌ మల్లీ మోడల్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సిస్టం) సేవలను పొడగిస్తామని, అందుకు సంబంధించిన టెండ ర్ల ప్రక్రియ పూర్తయిందని ఆదివారం కేంద్ర మంత్రి చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన టెర్నినల్‌ ప్రారంభంలో వెల్లడించారు.

ఎంఎంటీఎ్‌సకు మార్గం సుగమం

‘ఘట్‌కేసర్‌-యాదాద్రి’ రైల్వేలైన్‌లో ముందడుగు

టెండర్లు పూర్తి, త్వరలో పనుల ప్రారంభం

వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తగ్గనున్న రవాణా, ప్రయాణ భారం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకు నే భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి(యాదాద్రి) రైల్వేస్టేషన్‌ వరకు ఎంఎంటీఎస్‌ (హైదరాబా ద్‌ మల్లీ మోడల్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సిస్టం) సేవలను పొడగిస్తామని, అందుకు సంబంధించిన టెండ ర్ల ప్రక్రియ పూర్తయిందని ఆదివారం కేంద్ర మంత్రి చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన టెర్నినల్‌ ప్రారంభంలో వెల్లడించారు. దీంతో త్వరలో ఎంఎంటీఎస్‌ పనులు ప్రారంభంకానున్నాయి.

ఎంఎంటీఎస్‌ సేవల విషయం ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉండగా, టెండర్లు పూర్తికావడంతో పనులు ముందుకు సా గనున్నాయి. యాదాద్రితో పాటు కొమరవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నూతన రైల్వే స్టేషన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పూర్తయ్యాక యాదాద్రికి, కొమురవెల్లికి ప్రత్యేక ట్రైన్లు నడవనున్నాయి. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్‌ రైల్‌ను నడపాలని భక్తులు కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు 2016 లో ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం ఘట్‌కేసర్‌ వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ సేవలను రాయగిరి రైల్లేస్టేషన్‌ వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రైల్వేలైన్‌ నిర్మాణానికి 2016-17లో రూ.330కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. రెండోదశ విస్తరణ సమగ్ర అంచనా వ్య యానికి అప్పటి ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకారం తెలిపింది. ఎంఎంటీఎస్‌ విస్తరణకు అయ్యే ఖర్చులో మూ డింట రెండోవంతు వ్యయం భరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ముందుకు వచ్చింది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విస్తరణ పనుల ను రైల్వేశాఖ పెండింగ్‌లో పెట్టింది. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్‌ కొనసాగుతుండగా, అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడోలైన్‌ ఏర్పాటుచేయాల్సి ఉంది. భక్తుల సౌకర్యార్థం ఘట్‌కేసర్‌-రాయగిరి వర కు ఎంఎంటీఎస్‌ను విస్తరించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చివరికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండానే ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరిస్తామని 2023లో ప్రకటించింది. దీంతో ఈ సేవల విస్తరణపై అడుగు ముందుకు పడింది. భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీచేసింది. భూసేకరణ పూర్తి కాగానే రైల్‌వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎన్‌ల్‌) ద్వారా పనులు చేపట్టనున్నారు.

మార్గం సుగమం

యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సికింద్రాబాద్‌ నుంచి ఖాజీపేట్‌ వైపు ఇప్పటివరకు రెండు లైన్ల మా ర్గం మాత్రమే ఉంది. ఇటు నుంచి ఉత్తర భారతదేశంతో పాటు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లతో స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులను దృష్టిలో పెట్టుకుని ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరించేందుకు కేంద్ర రైల్వేశాఖ ముందుకు వచ్చింది. దీంతో ఘట్‌కేసర్‌-రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ మూడో రైల్వేలైన్‌ నిర్మాణం ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉండగా, ఈ పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. సౌత్‌సెంట్రల్‌ రైల్వే అధికారులు రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం మొత్తం 33కిలోమీటర్లకు సుమారు 60ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రైల్వే లైన్‌ ఏర్పాటుచేయాలంటే భూసేకరణ ప్రధానం. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. రైల్వేలైన్‌ బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. బీబీనగర్‌, భువనగిరి మండలాల పరిధిలోని పలు గ్రామాల మీదుగా ఈ రైల్వే మార్గం ఏర్పాటు కానుంది. ఎంఎంటీఎస్‌ రైల్వేలైన్‌తో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోనున్న బాధితులకు పరిహారంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

తగ్గనున్న ప్రయాణ, రవాణా భారం

స్వామివారిని ప్రతీ రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కు చెల్లిస్తున్నారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి నగరం నుంచే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు ఇక్కడికి వస్తుండగా, నగరం లో విపరీతమైన ట్రాఫిక్‌ కారణంగా గంటన్నరకు పైగా నే సమయం హైదరాబాద్‌ నగరం దాటేందుకే పడుతోంది. నగరం దాటిన తర్వాత మరో రెండుగంటలు, మొత్తంగా నాలుగైదు గంటలు ప్రయాణానికే పోతోంది. బస్సుల్లో, ప్రైవేట్‌ వాహనాల్లో అధిక మొత్తం చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ సేవ లను విస్తరించనుండటంతో భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రవాణా భారంతోపాటు దూరం కూడా తగ్గనుంది. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21కిలోమీటర్ల మేర కొత్తగా రెండు ఎంఎంటీఎస్‌ లైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఘట్‌కేసర్‌ నుంచి మరో 33కిలలోమీటర్లు మేర కొత్తలైన్‌ ఏర్పాటుచేస్తే హైదరాబాద్‌ నగరం నుంచి కేవలం రూ.20 టిక్కెట్‌తో గంటలోపే యాదాద్రికి చేరుకునే అవకాశం ఉంది.

Updated Date - Oct 21 , 2024 | 12:57 AM