భగవంతుడితోనే మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:28 AM
భగవంతుడి లీలలు, కథలు, చరిత్ర చదివినా, విన్నా ఆయన నామస్మరణ చేసినా మానసిక ప్రశాంతత లభిస్తుందని నైమిశారణ్య పీఠాధిపతి బాలబ్రహ్మానందసరస్వతీ అన్నారు. మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ‘శివ లీల విలాస, విజ్ఞానం’పై ఆయన ప్రవచించారు.
నైమిశారణ్య పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతీ
మేళ్లచెర్వు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : భగవంతుడి లీలలు, కథలు, చరిత్ర చదివినా, విన్నా ఆయన నామస్మరణ చేసినా మానసిక ప్రశాంతత లభిస్తుందని నైమిశారణ్య పీఠాధిపతి బాలబ్రహ్మానందసరస్వతీ అన్నారు. మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ‘శివ లీల విలాస, విజ్ఞానం’పై ఆయన ప్రవచించారు. భగవతారాధన చేసే వారిపై ఎటువంటి చెడు అంశాలు ఏమీ చేయలేవని, శత్రుబాధలు, రుణబాధలు ఉండవన్నారు. శిశతత్వాన్ని బోధించే శక్తి విష్ణుకు మాత్రమే ఉందని, సృష్టిలోని ప్రతీ వ్యక్తికి భగవంతుడు ఒకే శక్తిని ఇచ్చాడని, ఆ శక్తితో సన్మార్గంలో నడిచిన వారికి దైవకటాక్షం, మోక్షం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన శాగంరెడ్డి శంభిరెడ్డి, ఈవో కొండారెడ్డి, అర్చకులు, విష్ణువర్థన శర్మ, ధనుంజయ శర్మ, భానుకిరణ్‌శర్మ, రామ మందిర ఈవో శంభిరెడ్డి, కాకునూరి భాస్కర్‌రెడ్డి, గజ్జెల శంకర్‌రెడ్డి, కే సుబ్రమణ్యం, దాస శంభయ్య, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు బాలబ్రహ్మానంద సరస్వతీ స్వామిజీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో స్వామిజీ పాల్గొన్నారు.