పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం
ABN , Publish Date - Oct 18 , 2024 | 01:02 AM
పత్తి కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఈ నెల 16న కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
సీసీఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాలు
రైతుల్లో గుబులు పుట్టిస్తున్న తేమశాతం
8 కంటే తక్కువగా ఉంటేనే మద్దతు
ఆపై ఒక్కో శాతానికి రూ.58.25 తగ్గింపు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట సిటీ)
పత్తి కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఈ నెల 16న కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పత్తి సాగు, దిగుబడి అంచనా తదితర అంశాలను తెలుసుకున్నారు. కాటన కార్పొరేషన ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాల ఏర్పాటు, కొనుగోళ్లలో పాటించాల్సిన నిబంధనలు వంటి అంశాలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చించారు. జిల్లావ్యాప్తంగా మూ డు ప్రాంతాల్లో ఆరు కొనుగోలు కేంద్రాలు ప్ర ారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు మార్కెటింగ్, వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలోనే సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఏడాది పత్తి పంట చేతికి వచ్చేనాటికి వరుణుడు రైతులపై కన్నెర్ర చేశాడు. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కురిసిన అకాల వర్షాలకు పత్తి పంటకు కొంతమేర నష్టం వాటిల్లింది. సీసీఐ కేంద్రాలను ప్రారంభించడంలో ఆల స్యం కావడంతో చేతికొచ్చిన పంటను ఇప్పటికే చాలామం ది రైతులు దళారులకు తక్కువ ధరలకే విక్రయించారు. సాధారణంగా ప్రతీ ఏడాది అక్టోబరు మొదటి వారంలోనే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు. ఇటీవల అకావర్షాల ప్రభావం, సీసీఐ కేంద్రాల ఎంపికలో అధికారులు ఆలస్యం వంటి కారణాలతో కొనుగోలు కేంద్రాలను ప్రా రంభం చేయడంలో జాప్యం జరిగింది. అయితే గ్రామాల్లో పత్తిముమ్మరంగా చేతికివస్తుండటంతో అధికార యం త్రాంగం సీసీఐ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది.
అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి
ఈసీజనలో జిల్లాలో పత్తిపంట దిగుబడిపై అకాల వ ర్షాలు తీవ్రప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జిల్లాలో 87,067ఎకరాల్లో పత్తిపంటను సాగు చేస్తారని ప్రాథమిక అంచనా వేయగా ఖరీఫ్ సీజన ప్రారంభంలో వర్షాల రాక ఆలస్యం కావడంతో 78,079 ఎకరాల్లోనే సాగు చేశారు. దీనికి తోడు ఇటీవలి వర్షాలకు 5 వేల ఎకరాలకు పైగా పత్తి పంటకు నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దిగుబడిపై వర్షాల ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎకరాకు సుమారు ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని జిల్లా వ్యాప్తంగా 6,47,600 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
టోకెన విఽధానంపై కసరత్తులు
కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన విధానం అమలుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా టోకెన విధానం అమలు చేయాలా? వద్దా ? అని మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అమలు చేయాల్సి వస్తే ఎన్ని టోకెన్లు ఇవ్వాలి, ఏ నిబంధనలు పాటించాలి, ఒక్కో టోకెనపై ఎన్ని క్వింటాళ్లను విక్రయించవచ్చు అన్న అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. అదేవిధంగా టోకెన్ల కోసం రైతులు ముందస్తుగా కేంద్రాలకు రావాలా? ఆయా మండల వ్యవసాయాధికారుల వద్ద తీసుకోవాలా? అన్న విషయాలపై సమీక్షిస్తున్నారు. అయితే గతేడాది ఒక రోజు ముందుగా కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు వారి పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సీసీఐ అధికారులకు ఇస్తే వారే రైతులకు టోకెన్లు ఇచ్చారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో టోకెన్లు ఇస్తారా? లేదా అనేది వేచిచూడాలి.
ఆందోళన కలిగిస్తోన్న తేమశాతం
పత్తి పంటకు మద్దతు ధర పొందాలంటే నాణ్యతా ప్రమణాలను పాటించాలనే నిబంధన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి పం టకు మద్దతు ధర రూ.7,521లు(లాంగ్ స్టేపుల్), రూ.7,121(మీడియం స్టేపుల్)లుగా కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. తేమశాతం 8 కంటే తక్కువగా ఉంటేనే మద్దతు ధర ఇస్తామని సీసీఐ అధికారులు తెలిపారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రతీ ఒక శాతానికి రూ.58.25 చొప్పున ధర తగ్గు తుందని పేర్కొంటున్నారు. తేమశాతం 12 కంటే ఎక్కువగా ఉన్న పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉండదంటున్నారు.అయితే ప్రస్తుతం వాతారణంలో మార్పులతో తేమశాతం 16 నుంచి 25 వరకూ వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. తేమశాతం నిబంధన కారణంగా తక్కువ ధరలు కేటాయింపులు చేయడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. తేమశాతం పాటించకుండా పత్తి రంగు, నాణ్యతా, శుభ్రత ప్రమాణాల ద్వారానే ధరలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాలు ఇవే
జిల్లావ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. తిరుమలగిరి ప్రాంతంలో 3, హుజూర్‌నగర్ ప్రాంతంలో 2, సూర్యాపేట ప్రాంతంలో ఒక్కటి చొప్పున మొత్తం ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
సూర్యాపేట మండలం బాలెంల సమీపంలోని మంజిత కాటన మిల్లు
తిరుమలగిరి మండల కేంద్రంలోని సిద్దిక్ ఫైబర్, సంతోషిమాత, శ్రీనివాస్ జిన్నింగ్ మిల్లు
చింతలపాలెం మండల కేంద్రంలోని డాక్టర్ అండ్ ఫ్రైండ్స్ కాటన మిల్లు, భారతమ్మ కాటన మిల్లు
నాణ్యతా ప్రమాణాలుంటేనే మద్దతు ధర
జిల్లాలో ఆరు పత్తి కొనుగోలుకేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. అప్పట్లోగానే దళారులకు పం టను విక్రయించి, నష్టపోవద్దు. సీసీఐ కేంద్రాల్లో పత్తి నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే మద్దతు ధర ఇస్తారు. ఇంటి వద్దనే పంటను ఆరబెట్టుకుని తీసుకురావాలి. రైతు వెంట ఆధార్‌కార్డ్, పాస్‌పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.
శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి