నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:32 AM
మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జడ్పీ సీఈవో శోభారాణి ఆదేశించారు. మంగళవారం తుర్కపల్లి మండలంలోని రామాపురం ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తుర్కపల్లి, అక్టోబరు 1: మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జడ్పీ సీఈవో శోభారాణి ఆదేశించారు. మంగళవారం తుర్కపల్లి మండలంలోని రామాపురం ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను పరిశీలించి, విద్యార్థులకు వసతి సౌకర్యాలు, తదితర అంశాలను ప్రిన్సపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి, ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అంతకు ముందు మండలకేంద్రంలో ప్లాస్టిక్ వాడకం అనర్ధాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఝాన్సీలక్ష్మిబాయి, ఎంఈవో వి.మాలతి ఉన్నారు.