Share News

ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్లకు తాకట్టు

ABN , Publish Date - Feb 03 , 2024 | 11:08 PM

కేంద్రంలో బీజేపీ హయంలోని పదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్లకు తాకట్టు
సూర్యాపేటలో సమ్మె కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

సూర్యాపేట టౌన / ఆత్మకూర్‌(ఎస్‌) / పెనపహాడ్‌ / పాలకవీడు/ ఫిబ్రవరి 3 : కేంద్రంలో బీజేపీ హయంలోని పదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య అన్నారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిర్వహించే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత బంద్‌ కరపత్రాలను ఆవిష్కరించి, మాట్లాడారు. బంద్‌లో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఐఎ్‌ఫటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, దేశోజు మధు, మురళీ పాల్గొన్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మధ్యాహ్న భోజన కార్మికుల తరుపున సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో సంఘం మండల కన్వీనర్‌ యాతాకుల వెంకన్న, వీరన్న, మారపాక ముత్తయ్య, మల్లయ్య, బిక్షం పాల్గొన్నారు. పెనపహాడ్‌ ఎంపీడీవో బాణాల శ్రీనివాస్‌, ఎంపీవో నరే్‌షలకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు నోటీసు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ధనియాకుల శ్రీనివాస్‌, రణపంగి కృష్ణ, నకిరేకంటి నర్సయ్య, మట్టయ్య, యల్లమ్మ, నరేష్‌, ఏడుకొండలు పాల్గొన్నారు. సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు అనంత ప్రకాష్‌ పాలకవీడులో కోరారు. హుజూర్‌నగర్‌ ఎంపీడీవో లావణ్యకు జీపీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పీ హుస్సేన్‌, హసన్‌మియా, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, రంగారెడ్డి, కనకయ్య, సైదులు, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2024 | 11:08 PM