Share News

విద్యలో మతతత్వ విధానాలను విడనాడాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:32 AM

విద్యలో మతత త్వ విధానాలను విడనాడి శాస్త్రీ య బోధన విధానానికి ప్రాధా న్యం ఇవ్వాలని సోమవారం జరిగిన టీఎ్‌సయూటీఎఫ్‌ ముగింపు సమావేశాల్లో పలువురు నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం లో జరుగుతున్న రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర ఆరో విద్యా వైజ్ఞానిక ముగింపు సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

విద్యలో మతతత్వ విధానాలను విడనాడాలి

టీఎ్‌సయూటీఎఫ్‌ ముగింపు సమావేశాల్లో నేతలు

పలు తీర్మానాలకు ఆమోదం

నల్లగొండ, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): విద్యలో మతత త్వ విధానాలను విడనాడి శాస్త్రీ య బోధన విధానానికి ప్రాధా న్యం ఇవ్వాలని సోమవారం జరిగిన టీఎ్‌సయూటీఎఫ్‌ ముగింపు సమావేశాల్లో పలువురు నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం లో జరుగుతున్న రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర ఆరో విద్యా వైజ్ఞానిక ముగింపు సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ, పెం డింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలన్నారు. సీపీఎ్‌సను రద్దు చేసి ఓపీఎ్‌సను పునరుద్ధరించాలని కోరారు. 317జీవో బాధితులకు న్యాయం చేయాలని, ఖాళీగా ఉన్న జీహెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పదోన్నతులు కల్పిం చాలన్నారు. జేఎల్‌ పదోన్నతులకు 40శాతం కోటాను పునరుద్ధరించి ప్రక్రియ చేపట్టాని, 223 జీవోను రద్దు చేయాలన్నారు. అన్ని అప్‌గ్రేడ్‌ పాఠశాలలకు అవసరమైన పోస్టులు మంజూ రు చేయాలని డిమాండ్‌ చేశారు. గత ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 5,571 పీఎ్‌సహెచ్‌ఎం పోస్టులు మం జూరు చేయాలని, డీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు పీఎస్‌ హెచ్‌ఎం అర్హత కల్పించాలన్నారు. రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్‌ టీచర్ల సర్వీస్‌ కాలానికి నోషనల్‌ ఇంక్రిమెంట్‌ అమలు చేయాలని, అవుట్‌ సోర్పింగ్‌ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్‌ విధానం అమలు చేయాలన్నారు. గురుకుల ఉపాధ్యాయులకు పనిభారాన్ని బట్టి అదనపు ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి ప్రతీ నెల సకాలంలో బిల్లులు చెల్లించడానికి గ్రీన్‌ఛానల్‌ విధానాన్ని పాటించాలన్నారు. గురుకుల పాఠశాలలో మెనూ, అకాడమిక్‌ తదుపరి విషయాల్లో ఏకీకృత విధానం కోసం కామన్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌.రాములు, లక్ష్మారెడ్డి, మాణిక్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌, వెంకట్‌, సత్యానంద్‌, నాగమణి, జ్ఞానమందిరి, బక్క శ్రీనివాసచారి, పెరుమాళ్ల వెంకటేశం, ఎడ్ల సైదులు, నలపరాజు వెంకన్న, ఎర్రనాగుల సైదులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంఘం క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు.

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా చావ రవి

టీఎస్‌ యూటీఎఫ్‌ 2024-26 సంవత్సరాలకు గాను రాష్ట్ర అధ్యక్షుడిగా చావ రవి, ప్రధాన కార్యదర్శిగా ఎ.వెంకట్‌ ఎన్నికయ్యారు. అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా కె.జంగయ్య, సీహెచ్‌.దుర్గభవాని, కోశాధికారిగా లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా సీహెచ్‌.రాములు, సోమశేఖర్‌, ఎం.రాజశేఖర్‌రెడ్డి, వి.శాంతకుమారి, జి.సమ్మారావు, జి.సత్యానంద్‌, జి.నాగమణి, బి.రాజు, కె.రంజిత్‌కుమార్‌, ఎస్‌.రవిప్రసాద్‌ గౌడ్‌, ఎస్‌.మల్లారెడ్డి, కె.రవికుమార్‌, జీ.శ్రీధర్‌, సింహాచలం, జ్ఞానమంజరి, ఎన్‌.వెంకటప్ప ఎన్నికయ్యారు.

Updated Date - Dec 31 , 2024 | 12:32 AM