Share News

బోరింగ్‌తండాలో మద్యనిషేధంపై తీర్మానం

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:34 AM

ప్రశాంతమైన తండాలో మద్యం మహమ్మారి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుందని, అందుకే తమ గ్రామాల్లో మద్యం నిషేధించాలని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలంలో పల్లెలు ఒక్కొక్కటిగా ప్రతినబూనుతున్నాయి.

బోరింగ్‌తండాలో మద్యనిషేధంపై తీర్మానం
గ్రామంలో మద్యనిషేధం విధించుకుంటూ చేసిన తీర్మానాల కాపీలను చూపిస్తున్న గ్రామస్థులు

ఆత్మకూరు(ఎస్‌), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రశాంతమైన తండాలో మద్యం మహమ్మారి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుందని, అందుకే తమ గ్రామాల్లో మద్యం నిషేధించాలని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలంలో పల్లెలు ఒక్కొక్కటిగా ప్రతినబూనుతున్నాయి. మొన్నటి వరకు మండలంలోని మూడు గ్రామాల్లో మద్యం నిషేధం అమలుకు తీర్మానించగా మంగళవారం బోరింగ్‌తండాలో మద్యపాననిషేధం అమలుకు తీర్మానించారు. వివిధ సామాజిక, రాజకీయ వర్గాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో సమావేశమయ్యారు. గ్రామంలో మద్యం దుకాణాలు మూసివేయాలని అఖిలపక్షాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక నుంచి మద్యం విక్రయించడం, తాగడం చేయవద్దంటూ ప్రతిజ్ఞ చేశారు. బోరింగ్‌తండాలో మద్యం విక్రయించినా, తాగినా జరిమానా విధిస్తామని, ప్రతీ రాజకీయ పార్టీల కులసంఘాలు, యువజన సంఘాల నుంచి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించారు. గ్రామాల్లో మద్యనిషేధం చేసుకోవడం సంతోషకరమైన శాంతియుతంగా ఉద్యమాలు చేసుకొని గ్రామాల్లో అభివృద్ధి పరుచుకోవాలని సూచించారు. కిరాణాషాపులు మరే విధమైన ప్రాంతాల్లో గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గుగులోతు గణేష్‌, చాంప్లా, కుమార్‌, సురేందర్‌, శ్రీనివాస్‌, శేఖర్‌, వీరన్న, ప్రేమ్‌కుమార్‌, నందు, పార్వతీ, పద్మ, బుజ్జి, చంద్రకళ, కల్పన, మంజుల పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 12:34 AM