Share News

రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:36 AM

డివిజన్‌ పరిధిలో ని ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం, భూసేకరణతోపాటు రెవెన్యూ సమస్యలు జాప్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలాత్రిపాఠి ఆదేశించారు. మం గళవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కలెక్టర్‌ ఇలాత్రిపాఠి

దేవరకొండ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌ పరిధిలో ని ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం, భూసేకరణతోపాటు రెవెన్యూ సమస్యలు జాప్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలాత్రిపాఠి ఆదేశించారు. మం గళవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ‘ప్రజావాణి’ ఫిర్యాదులు, భూసేకరణకు సంబంధించిన సమస్యల కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డివిజన్‌ పరిధిలోని నక్కలగండి, పెండ్లిపాకల, ఓపెన్‌కెనాల్‌, డిండి రిజర్వాయర్‌ పనులకు భూసేకరణ, పునరావాసం వివరాలను ఆర్డీవో రమణారెడ్డిని అడి గి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, ప్రత్యేక ఓటరు జాబి తా సవరణ, ‘ప్రజావాణి’ ఫిర్యాదులను ఆమె సమీక్షించారు.

సర్వేను పకడ్బందీగా పూర్తిచేయాలి

(ఆంధ్రజ్యోతి, చందంపేట): ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించి అర్హులను గుర్తించాలని కలెక్టర్‌ ఇలాత్రిపాఠి అన్నారు. మంగళవారం చందంపేట మండలంలోని గాగిళ్లపురం, మురుపునూతల, పాతూరుతండా గ్రామాల్లో సర్వేను ఆమె తని ఖీ చేశారు. సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదుకు యాప్‌లో నెట్‌వర్క్‌ సమస్య వస్తోందని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. నెట్‌వర్క్‌ సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఆమె వెంట ఆర్డీవో రమణారెడ్డి, ఎంపీడీ వో శ్రీలక్ష్మీ, తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:36 AM