Road Accident: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
ABN , Publish Date - Feb 25 , 2024 | 09:32 AM
నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం, ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి, ఆగి ఉన్న లారీని ఢీ కొంది.
నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం, ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి, ఆగి ఉన్న లారీని ఢీ కొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.