ఆర్‌ఆర్‌ఆర్ అలైౖనమెంటును మార్చాలి
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:54 AM
ఆర్‌ఆర్‌ఆర్ అలైనమెంటు మార్చాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి
చౌటుప్పల్ రూరల్, అక్టోబరు (ఆంధ్రజ్యోతి) 26: ఆర్‌ఆర్‌ఆర్ అలైనమెంటు మార్చాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని మందోళ్లగూడెంలో సీపీఎం గ్రామశాఖ 11వ మహాసభ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌తో వందలాడి మంది రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధరంగా ఆర్‌ఆర్‌ఆర్ అలైనమెంటు ఏర్పాటు చేశారని విమర్శించారు. గత ఎన్నికల్లో అలైనమెంటు మారుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు హామీని విస్మరించిందన్నారు. అలైనమెంటు మార్చకుంటే ఎకరాకు రూ.3కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, నాయకులు దొనూరి నర్సిరెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, యండీ పాష, గంగాదేవి సైదులు, రాగీర్ కిష్టయ్య, తడక మోహన, బొజ్జ బాలయ్య, కొండె శ్రీశైౖలం, అన్నబోయిన వెంకటేశం, ఇట్టబోయిన శేఖర్, సప్పిడి రాఘవరెడ్డి పాల్గొన్నారు.