Share News

ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:16 AM

యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో హైదరాబాద్‌-భూపాలపల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు.

ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
అదుపు తప్పి రోడ్డు మధ్యలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

యాదగిరిగుట్ట రూరల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో హైదరాబాద్‌-భూపాలపల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. సుమారు 8.45 నిమిషాలకు యాదగిరిగుట్ట మండలం మోటకొండూరు అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణం వద్ద అదుపు తప్పి రోడ్డు మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న చువ్వల జాలీమీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికుల్లో కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో భువనగిరి ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికి ఆర్టీసీ బస్సును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 12:16 AM