Share News

కొత్తబస్సులతో ఆర్టీసీ సేవలు మెరుగు

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:32 AM

గ్రామాల్లో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం లేకుండా గ్రామాల్లో కొత్త బస్సులతో ఆర్టీసీ సేవలు మరింతగా మెరుగు పడనున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

కొత్తబస్సులతో ఆర్టీసీ సేవలు మెరుగు
జెండా ఊపీ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం లేకుండా గ్రామాల్లో కొత్త బస్సులతో ఆర్టీసీ సేవలు మరింతగా మెరుగు పడనున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో కొత్తగా ఆరు బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించి, కొంతదూరం బస్సును నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్లకాలంగా నియోజకవర్గంలో రవాణా సౌకర్యం లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం ఉన్నా గ్రామాలకు కాదు, మండలాల వారీగా బస్సు సర్వీసులు నడుపకపోవటం సరికాదన్నారు. గ్రామాల్లో ప్రతి నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించి వెంటనే కొత్తగా ఆరు కొత్త బస్సులను మంజూరు చేశారన్నారు. నియోజకవర్గ ప్రజల తరుపున ఆయనకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆర్టీసీ బస్సుల సర్వీసులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామాల్లో కొత్తగా నడిపే బస్సు సర్వీసులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండనుందన్నారు. ప్రభుత్వం అమలు చేసే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఈప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కానుందన్నారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆ సంస్థ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన శ్రీనివా్‌సరెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ జానిరెడ్డి, జిల్లా ఆర్‌ఎం శివశంకర్‌, డిపో మేనేజర్‌ శ్రీనాథ్‌, ఎస్‌ఐ ఇరుగు రవి, నియోజకవర్గ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రయాణికులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 12:32 AM